Live Updates
యుద్దంలో భారీ ట్విస్ట్.. హౌతీల సంచలన ప్రకటన
సౌదీ అరేబియా యువరాజుకు ప్రధాని మోదీ ఫోన్
- సౌదీ అరేబియా యువరాజుతో మాట్లాడిన ప్రధాని మోదీ
- పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై చర్చించిన మోదీ
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్‌పై దాడులను ఖండించిన మోదీ
గల్ప్ దేశాలకు ఇరాన్ హెచ్చరిక
- శాంతి కావాలంటే తాము చెప్పినట్టు వినాల్సిందేనన్న ఇరాన్
- గల్ఫ్ గగనతలాలను యూఎస్, ఇజ్రాయెల్ వినియోగించుకోకుండా నిషేధం విధించాలన్న ఇరాన్
- తాము చెప్పినట్టు చేస్తేనే గల్ఫ్‌పై దాడులు ఆపుతామన్న ఇరాన్
ఒమన్‌పై ఇరాన్ భీకర దాడులు
- ఒమన్‌పై ఇరాన్ భీకర దాడులు
- సలాల్ పోర్టుపై డ్రోన్లతో దాడి చేసిన ఇరాన్
- ఇరాన్ మాజ్నూన్ ఆయిల్ ఫీల్డ్‌పై డ్రోన్ దాడి
హౌతీల సంచలన ప్రకటన
- యుద్దంలో భారీ ట్విస్ట్.. హౌతీల సంచలన ప్రకటన
- యుద్ధంలో లక్ష్యాలు సాధించే వరకు కార్యకలాపాలు కొనసాగిస్తామని హౌతీల శపథం
- తాము నిర్దేశించుకున్న లక్ష్యాలు సాధించే వరకు తమ సైనిక కార్యకలాపాలను కొనసాగిస్తామని ప్రకటన.
- యుద్ధం వేల ఇది ఒక సుదీర్ఘ పోరాటానికి సంకేతం.
- ఇజ్రాయెల్ వైపు క్షిపణిని ప్రయోగించినట్లు ఆ గ్రూపు ధృవీకరించిన కొద్దిసేపటికే ఈ హెచ్చరిక వెలువడింది.
- ఇది సుదీర్ఘ పోరాటానికి తాము సిద్ధంగా ఉన్నామని సూచిస్తోంది.
- దాడులకు ప్రతిస్పందనగా ఇజ్రాయెల్‌పై దాడి చేశామని హౌతీలు ప్రకటన.
BREAKING: The Houthis have officially announced entry into the conflict in support of Iran. Houthi military spokesperson: “We will target U.S. ships and warships in the Red Sea.” pic.twitter.com/8J2J1SuekX
— Conflict Alarm (@ConflictAlarm) March 27, 2026
ఇజ్రాయెల్ వైపు క్షిపణి ప్రయోగం
- ఇజ్రాయెల్ వైపు క్షిపణి ప్రయోగం
- శనివారం ఉదయం యెమెన్ నుంచి ఇజ్రాయెల్ వైపు క్షిపణి ప్రయోగం జరిగినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) వెల్లడించాయి.
- ఆపరేషన్ రోరింగ్ లయన్ తర్వాత హుతీ రెబల్స్ నుంచి ఇదే తొలి దాడి ప్రయత్నం.
- ఉద్రిక్తతలను మరింతగా పెంచే అవకాశం!
- ఆ క్షిపణిని అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు వెంటనే స్పందించాయి.
- బీర్‌షెబా నగరం, నెగెవ్ పరిసర ప్రాంతాల్లో సైరన్లు మోగాయి.
- ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణనష్టం లేదా నేరుగా దాడి ప్రభావం జరిగినట్లు సమాచారం లేదు.
- యెమెన్ సాయుధ దళాలు నేరుగా యుద్ధంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నాయని స్పష్టమైన హెచ్చరికలు జారీ
- మా చేతులు ట్రిగ్గర్‌పై ఉన్నాయి అంటూ యెమెన్ సైన్య ప్రతినిధి యహ్యా సరీ వ్యాఖ్యలు
- యెమెన్ వైఖరి కేవలం రాజకీయమే కాదు, మతపరమైన బాధ్యతగా కూడా భావిస్తున్నామని సరీ ప్రకటన.
- ఇరాన్‌తో పాటు ముస్లిం దేశాలపై జరుగుతున్న దాడులను తాము సహించబోమని హెచ్చరిక.
- అమెరికా, ఇజ్రాయెల్ తక్షణమే దౌత్యపరమైన చర్చలకు రావాలని, గాజాలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్.
క్షిపణి శకలాలు పడి.. భారతీయులకు గాయాలు
- క్షిపణి శకలాలు పడి.. భారతీయులకు గాయాలు
- అబుధాబిలో క్షిపణి శకలాలు పడి.. భారతీయులకు గాయాలు
- తమవైపు దూసుకొచ్చిన బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా అడ్డుకున్న అబుధాబి గగనతల రక్షణ వ్యవస్థ
- ఈ క్రమంలో ఓ నివాస స్థలంలో పడిన శకలాలు
మొజ్తాబా ఖమేనీ చనిపోయే ఉంటాడు: ట్రంప్
- మొజ్తాబా ఖమేనీ చనిపోయే ఉంటాడు: ట్రంప్
- సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- ఇరాన్ నాయకత్వం మొత్తాన్ని తుడిచిపెట్టామన్న ట్రంప్
- ఆ దేశానికి సుప్రీం లీడరే లేడంటూ వ్యాఖ్య
- మొజ్తాబా కూడా చనిపోయి ఉంటాడని లేదంటే కోలుకోలేని స్థితిలో గాయపడి ఉంటాడన్న ట్రంప్
ఇరాన్‌పై దాడులు.. మార్క్ రూబియో కీలక ప్రకటన
- ఇరాన్‌పై భూతలదాడులు ఉండవు.. మార్క్ రూబియో ప్రకటన
- గ్రౌండ్ ఆపరేషన్ లేకుండానే పశ్చిమాసియాలో విజయం సాధిస్తామన్న రూబియో
- కొన్ని వారాల్లోనే యుద్ధం ముగిస్తుందన్న రూబియో
- మరోవైపు.. బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాల్లో భారీ పేలుళ్లు
- మొత్తం 10 పేలుళ్లు చోటుచేసుకున్నట్లు సమాచారం
- గల్ఫ్ దేశాలపై కొనసాగుతోన్న ఇరాన్ ప్రతీకార దాడులు
ఇరాన్‌పై ట్రంప్ సెటైర్లు.. ట్రంప్ జలసంధి’ అంటూ..
- ఇరాన్ హార్మూజ్‌ను ‘ట్రంప్ జలసంధి’ అంటూ వ్యాఖ్యలు
- మియామిలో జరిగిన కార్యక్రమంలో ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- ఇరాన్‌తో ప్రస్తుతం మేం చర్చలు జరుపుతున్నాం.
- వాటినుంచి ఏదైనా సానుకూల ఫలితం వస్తే బాగుంటుంది.
- ఇరాన్ వాళ్లు ట్రంప్ జలసంధిని(హార్మూజ్ జలసంధి) తెరవాలి.
- యుద్ధంలో అమెరికా సైన్యం తన లక్ష్యాలను సాధిస్తోంది.
- 47 ఏళ్లుగా పశ్చిమాసియా దేశాలపై ఇరాన్ బెదిరింపులకు పాల్పడుతోందని విమర్శలు.
- ఇక నుంచి అలాంటివి జరగవు.
- ఆపరేషన్ ఎపిక్ ప్యూరీతో ఇరాన్ సైనిక సామర్థ్యాలను దెబ్బతీశామని ప్రకటన.
ఇరాన్ సరిహద్దుల్లో అమెరికా సైనిక కదలికలు..
- ఇరాన్ సరిహద్దుల్లో భారీగా అమెరికా సైనిక కదలికలు.
- ఇరాన్ ముంగిట 17వేల అదనపు సైనికులను మోహరిస్తున్న పెంటగాన్.
- ఇరాన్ అణుకేంద్రాలు, చమురు నిల్వలే లక్ష్యంగా అమెరికా వ్యూహం.
- పశ్చిమాసియాకు పారాచూట్ దళాలు మెరైన్ ఎక్స్‌పెడిషనరీ యూనిట్లు.
- గగనతల దాడుల నుంచి భూతల యుద్ధం వైపు అమెరికా అడుగులు.
- ఇరాన్ సుప్రీం లీడర్ మరణం తర్వాత ఆ దేశంపై పెరిగిన ఒత్తిడి.
- ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఇరాన్ సైన్యం.
- ఇప్పటికే మోహరించిన యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక నౌకలు.
గల్ఫ్ దేశాల్లో హైఅలర్ట్..
- అమెరికా ఎయిర్‌బేస్‌పై ఇరాన్ దాడి..
- సౌదీలోని అమెరికా ఎయిర్‌బేస్‌పై ఇరాన్ భీకర దాడి.
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్ లక్ష్యంగా ఇరాన్ దాడులు.
- క్షిపణులు, డ్రోన్లతో దాడిచేసిన ఇరాన్.
- 10 మంది అమెరికా సైనికులకు తీవ్ర గాయాలు.
- ఎయిర్‌బేస్‌లో ఉన్న యుద్ధ విమానాలకు భారీ నష్టం.
- ఇరాన్ తీరును తీవ్రంగా ఖండిచిన అమెరికా పెంటగాన్ వర్గాలు.
- ప్రతీకార దాడులకు సిద్ధమవుతున్న అమెరికా సైన్యం.
- పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు.
- గల్ఫ్ దేశాల్లో హైఅలర్ట్..
ÚLTIMO MINUTO 🇮🇷💥🇮🇱
Irán lanzó un gran ataque con misiles contra una base militar israelí.
Según los informes, numerosos soldados israelíes se encontraban en la base en ese momento!! RT #Irán #Israël #guerra #war #IranWar #Trump #Urgente pic.twitter.com/dqbXULUTax— Alerta Mundial (@TuiteroSismico) March 27, 2026
ట్రంప్, మోదీ మధ్య మస్క్
- పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణల మధ్య ట్రంప్, మోదీ సంభాషణ.
- వీరి మధ్యలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పాల్గొన్నారని న్యూయార్క్ టైమ్స్ నివేదిక.
- ట్రంప్, మోదీల సంభాషణ ఫలవంతమైనదని కరోలిన్ లీవిట్ ప్రకటన.
- ఎలాన్ మస్క్ గురించి ప్రస్తావించని లీవిట్.


