బిల్డప్‌ కోసం బిల్‌గేట్స్‌తో ఫొటో.. ఫొటోషాప్‌తో అడ్డంగా దొరికి ఇజ్జత్‌ పొగొట్టుకున్నాడు

ISI Chief Skipped From Imran Khan Bill Gates Lunch Photo Trolled - Sakshi

పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ సోషల్‌ మీడియాలో అడ్డంగా బుక్కయ్యారు. బిల్డప్‌ కొట్టేందుకు బిల్‌గేట్స్‌తో ఉన్న ఓ ఫొటోను షేర్‌ చేయగా.. అందులోని ఓ పాయింట్‌తో పాక్‌ ప్రధానిని ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. 

మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన బిల్‌గేట్స్‌.. తాజాగా పాక్‌లో పర్యటించారు(ఆయన పాక్‌లో పర్యటించడం ఇదే ఫస్ట్‌ టైం). ఈ సందర్భంగా ఇమ్రాన్‌ ఖాన్‌ తన కేబినెట్‌లోని మంత్రులు, కీలక విభాగాధిపతులతో కలిసి బిల్‌గేట్స్‌తో లంచ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన ఓ ఫొటోను పాక్‌ పీఎంవో ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. అయితే అందులో అంతా ఓ వ్యక్తి వైపు తిరగ్గా.. అక్కడ ఎవరూ లేకపోవడం ఫొటోకి హైలెట్‌ అయ్యింది.

పాక్‌ న్యూస్‌ ఏజెన్సీ ది కరెంట్‌ కథనం ప్రకారం.. అక్కడ ఉంది ఐఎస్‌ఐ(Inter-Services Intelligence) చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ నదీమ్‌ అంజుమ్‌. అతన్ని ఫొటోగానీ, వీడియోలు తీయడానికి ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ అంగీకరించదు. ఒక్కపక్క నదీమ్‌ ఐడెంటిటీని రివీల్‌ చేయడం ఇష్టం లేని పాక్‌ ప్రభుత్వం.. మరోపక్క బిల్‌గేట్స్‌తో ఉన్న ఫొటోను ఎలాగైనా షేర్‌ చేయాలని ఉవ్విళ్లూరింది. తద్వారా పాక్‌ ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు చర్చలు జరుపుతున్నట్లు ప్రతిపక్షాలకు కలరింగ్‌ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే ఫొటో షాప్‌లో ఐఎస్‌ఐ చీఫ్‌ ఫొటోను ఎగరకొట్టేయడం, అందరూ నదీమ్‌ వైపే చూస్తుండడంతో.. ఈ ఫొటో వంకతో ఇమ్రాన్‌ ఇజ్జత్‌ తీసేస్తున్నారు పాక్‌ నెటిజన్లు. 

గత అక్టోబర్‌లో నదీమ్‌.. ఐఎస్‌ఐ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఆ సమయంలో ఆర్మీ మీడియా వింగ్‌ మొదట నదీమ్‌ పేరును ప్రకటించింది. ఆ తర్వాతే ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఖాన్‌ పాలనలో మిలిటరీ జోక్యం ఎక్కువైందని, ఫారిన్‌-మిలిటరీ పాలసీలను సైతం ప్రభావితం చేస్తున్నాయనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి.

చదవండి: ఇమ్రాన్‌ఖాన్‌ ది ఇంటర్నేషనల్‌ బెగ్గర్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top