ఎలాన్‌ మస్క్‌.. స్టార్‌ షిప్‌ ప్రయోగం విఫలం | Elon Musk SpaceX Starship Fails Third Time, Rocket Spins Out Of Control After 30 Minutes Of Launch | Sakshi
Sakshi News home page

ఎలాన్‌ మస్క్‌.. స్టార్‌ షిప్‌ ప్రయోగం విఫలం

May 28 2025 8:13 AM | Updated on May 28 2025 10:26 AM

Elon Musk SpaceX Starship Fails Third Time

టెక్సాస్‌: బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ తయారు చేసిన స్టార్ షిప్ రాకెట్ మరోసారి పేలిపోయింది. టెక్సాస్‌లోని స్పేస్‌ ఎక్స్‌ నుంచి ప్రయోగించిన స్టార్‌ షిప్‌ విఫలమైంది. స్టార్‌షిప్‌ రాకెట్‌ ఇలా పేలిపోవడం వరుసగా ఇది మూడోసారి కావడం గమనార్హం.. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

సుదూర అంతరిక్ష యాత్రల కోసం స్పేస్ ఎక్స్ కంపెనీ తయారు చేసిన స్టార్ షిప్ ప్రయోగం మరోసారి విఫలమైంది. టెక్సాస్‌లోని స్పేస్‌ ఎక్స్‌ నుంచి ప్రయోగించిన స్టార్‌ షిప్‌ తొమ్మిదో ఫ్లైట్ టెస్ట్​లో భాగంగా చివరి దశలో ఇంధనం లీక్‌ కావడంతో నియంత్రణ కోల్పోయింది. తొలుత ఇది విజయవంతంగానే నింగిలోకి దూసుకెళ్లినా.. దాదాపు అరగంట తర్వాత అది గాల్లోనే పేలిపోయింది. దీంతో, స్టార్‌ షిప్‌ శకలాలు సముద్రంలో పడిపోయాయి. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement