వీడియో: రియల్‌ బాహుబలి.. ఇలా చేయాలంటే గట్స్‌ ఉండాలి

Brave Man Saves Imphala Struck In Mud Video Viral - Sakshi

వైరల్‌: ఈ భూమ్మీద మనిషిలో మానవత్వం ఉందనే విషయాన్ని అప్పుడప్పుడు కొన్ని ఘటనలు నిరూపిస్తుంటాయి. వాటి గురించి ఎన్నిసార్లు చర్చించుకున్నా.. పెద్ద ఇబ్బందిగా అనిపించదు. ప్రాణం ఏదైనా ప్రాణమే అనుకున్న ఆ వ్యక్తి చేసిన సాహసం ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది.

పొడి భాగం అని పొరబడి వెళ్లి.. బురదలో కూరుకుపోయింది ఓ ఇంపాలా. చాలా సేపు దానిని ఎవరూ పట్టించుకోలేదు. బయటకు రావడానికి అది ఎంతో ఇబ్బంది పడి.. గాయపడింది కూడా. ఈలోపు నేషనల్‌ పార్క్‌లో పని చేసే కొందరు దాని అవస్థలు చూశారు. 

సాధారణంగా అలాంటి బురదల్లో.. ఊబిలు ఉండే అవకాశం ఉంటుంది. లేదంటే.. మొసళ్లు ఉండే ప్రమాదం కూడా ఉంటుంది. అయినా లెక్క చేయకుండా నడుముకి తాడుకు కట్టుకుని అందులోకి దిగాడు. నడుం లోతు బురదలో కష్టంగా ముందుకు వెళ్లి చాలా సేపు శ్రమించి.. దానిని బయటకు తీసుకురాగలిగాడు.

జింబాబ్వే నేషనల్‌ పార్క్‌లో చాలా ఏళ్ల కిందటే ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి తన ట్విటర్‌లో ఈ వీడియోను తన అకౌంట్‌లో పోస్ట్‌ చేయగా.. మూడున్నర మిలియన్ల వ్యూస్‌ దాకా చేరుకుని మరోసారి ట్రెండింగ్‌ వీడియోల్లోకి వచ్చేసింది. అదన్నమాట విషయం.  అతను చేసిన సాహసాన్ని మీరూ ఓ లుక్కేయండి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top