US Elections 2020: Twitter Removed Donald Trump's Tweet Over Winning | అమెరికా ఎన్నికలు, ట్రంప్‌ ట్వీట్‌ తొలగింపు - Sakshi
Sakshi News home page

అమెరికా ఎన్నికలు: ట్రంప్‌ ట్వీట్‌ తొలగింపు

Nov 4 2020 12:13 PM | Updated on Nov 4 2020 8:03 PM

America Election 2020 Twitter Removed Trump Tweet - Sakshi

వాషింగ్టన్‌ : అమెరికా ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. అభ్యర్థులిద్దరి మధ్యా గట్టి పోటీ నడుస్తోంది. విజయంపై ఇరు పక్షాలు ధీమాగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీడియా సమావేశాలు, ప్రకటనలు సైతం చేస్తున్నారు. డెమొక్రాటిక్‌ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థి బైడెన్‌ కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడారు. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి ట్రంప్‌ మీడియా ముందుకు రాకపోయినా ట్విటర్‌ వేదికగా కామెంట్లు చేస్తున్నారు. భారీ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ( ఈ ఎన్నికల్లో మేం గెలుస్తాం : జో బైడెన్‌ )

అంతేకాకుండా ‘‘ భారీ విజయం దిశగా ఉన్నాం. వాళ్లు ఎన్నికల్లో మోసం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. అలా జరగనివ్వం. పోలింగ్‌ అయిపోయిన తర్వాత ఓట్లు వేయటానికి ఒప్పుకోం!’’ అంటూ సంచలన కామెంట్లు చేశారు. ఈ ట్వీట్‌లోని వ్యాఖ్యలు ఎన్నికల్ని తప్పుదోవపట్టించేవిగా ఉన్నాయంటూ ట్విటర్‌ దాన్ని తొలగించింది. కాగా, ఇప్పటివరకు జో బైడెన్‌ 224, డొనాల్డ్‌ ట్రంప్‌ 213 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement