
No Headline
సాక్షి, సిటీబ్యూరో: వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు చిన్నారులతో పాటు పెద్ద వాళ్లు కూడా టీకాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచించారు. మాదాపూర్‌లో ఉన్న యశోద హాస్పిటల్స్ వయోజనుల వ్యాక్సిన్ల తయారీకి పేరొందిన ఫైజర్ ఇండియాతో కలిసి ప్రత్యేక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)ని బుధవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హాస్పిటల్స్ డైరెక్టర్లు డాక్టర్ పవన్ గోరుకంటి, డాక్టర్ లింగయ్య మాట్లాడుతూ.. టీకాలు వేయించుకోవటం బాల్యంలో మాత్రమే కాదు, జీవితాంతం తప్పనిసరి అని స్పష్టం చేశారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి టీకా ప్రయోజనకరమన్నారు. ఫైజర్ వ్యాక్సిన్‌న్స్ మెడికల్ అఫైర్స్ డైరెక్టర్ డాక్టర్ సంతోష్ టౌర్ మాట్లాడుతూ.. ఇన్ఫెక్షన్స్ నుంచి సమాజాన్ని కాపాడడానికి, పెద్దలలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత విస్తరించేందుకు తమ భాగస్వామ్యం ఉపకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment