
సాక్షి, సిటీబ్యూరో: ఎల్‌బీనగర్ జంక్షన్‌లో కుడివైపు ఫ్లై ఓవర్ త్వరలో ప్రారంభం కానుంది. నిర్మాణ పనులు పూర్తయిన దీనిని మంత్రి కేటీఆర్ త్వరలో ప్రారంభించనున్నట్లు జీహెచ్‌ఎంసీ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. నగరంలో ట్రాఫిక్‌చిక్కుల పరిష్కారానికి ఎస్సార్‌డీపీ కింద పలు ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతుండటం తెలిసిందే. ఇప్పటి వరకు 18 ఫ్లై ఓవర్లు వినియోగంలోకి రాగా ఇది 19వ ఫ్లై ఓవర్. దీని పొడవు 700 మీటర్లు, వెడల్పు 12 మీటర్లు.
భూసేకర ణ, యుటిలిటీస్ షిఫ్టింగ్‌లతో సహ ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికై న మొత్తం వ్యయం రూ. 32 కోట్లు అని అధికారులు పేర్కొన్నారు. ఈ ఫ్లై ఓవర్ వినియోగంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల మీదుగా వచ్చే ప్రజలతోపాటు నగర వాసులకు హయత్ నగర్ మీదుగా ఇతర ప్రాంతాల వెళ్లేందుకు ఎంతో సదుపాయంగా ఉంటుంది.