మొబైల్‌ వ్యసనాన్ని తగ్గించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

మొబైల్‌ వ్యసనాన్ని తగ్గించుకోవాలి

Apr 3 2026 8:08 AM | Updated on Apr 3 2026 8:08 AM

హన్మకొండ: విద్యార్థులు మొబైల్‌ వ్యసనాన్ని తగ్గించుకోవాలని ఎస్‌బీఐ వరంగల్‌ రీజినల్‌ మేనజర్‌ అ బ్దుల్‌ రహీం షేక్‌ అన్నారు. హనుమకొండ నయీంనగర్‌లోని వాగ్దేవి డిగ్రీ, పీజీ కళాశాలలో ఎంబీఏ విద్యార్థులకు మంత్ర 2కే26 జాతీయస్థాయి సద స్సు గురువారం నిర్వహించారు. ఎంబీఏ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కృష్ణమాచార్య అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడా రు. విద్యార్థులు విషయ పరిజ్ఞానంతో పాటు నైపుణ్యాలు పెంచుకోవాలన్నారు. కేయూ ప్రొఫెసర్‌ వరలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు కార్పొరేట్‌ అవసరాలకు తగ్గట్టుగా మైండ్‌ సెట్‌ మార్చుకోవాలని సూచించారు. ప్రొఫెసర్‌ అమరవేణి మాట్లాడుతూ ఎంబీఏ స్టూడెంట్స్‌ లీడర్‌షిప్‌ క్వాలి టీస్‌ పెంపొందించుకోవాలని కోరారు. మంత్ర 2కే26 కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఇతర ప్రాంతాల నుంచి 300కు పైగా ఎంబీఏ విద్యార్థులు పాల్గొన్నా రు. పలు పోటీలు నిర్వహించి విజేతలకు నగదు బహుమతి, సర్టిఫికేట్లు అందజేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బాధ్యులు, విద్యార్థులను వాగ్దేవి కళాశాలల వ్యవస్థాపకుడు సీహెచ్‌ దేవేందర్‌రెడ్డి, అకడమిక్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ వాహిని దేవి, విభా సీఈఓ విశ్వంబర్‌రెడ్డి అభినందించారు. మంత్ర 2కే26 కన్వీనర్‌ డాక్టర్‌ బి.కిశోర్‌ కుమార్‌, ఎంబీఏ విభాగం అధిపతి డాక్టర్‌ ఎస్‌.మహేందర్‌ కుమార్‌, సీనియర్‌ ప్రొఫెసర్‌ కె.రాజి రెడ్డి, ప్రొఫెసర్‌ కొనాటి రాజిరెడ్డి, అధ్యాపకులు పి.సుగుణాకర్‌రెడ్డి, ఎ.రజిన్‌కుమార్‌, టి.అనూష, డి.ప్రేమ్‌కుమా ర్‌, సీహెచ్‌.కరుణ, బి.చంద్రకళ నాయక్‌, ఎస్‌.శాంభవి, ఎం.అరవింద, సీహెచ్‌ స్వాతి, కె.వెంకటేశ్వర్లు, సీహెచ్‌ శ్రీకాంత్‌ వర్మ, విద్యార్థులు పాల్గొన్నారు .

ఎస్‌బీఐ రీజినల్‌ మేనేజర్‌

అబ్దుల్‌ రహీం షేక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement