ఆడపిల్లలను చిన్నచూపు చూడొద్దు..
హన్మకొండ: ఆడ పిల్లలను చిన్నచూపు చూడొద్దని హనుమకొండ అదనపు కలెక్టర్ రవి అన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధికా రత కేంద్రం ఆధ్వర్యంలో శనివారం హనుమకొండలోని అంబేడ్కర్ భవన్‌లో జాతీయ బాలికా దినోత్సవం జరిగింది. డీడబ్ల్యూఓ జె.జయంతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సీ్త్ర, పురుషులు అనే అసమానతలు రూపుమాపేందుకు బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని 2017లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. ఆడ పిల్లలు సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండాలని, మంచి ఆరోగ్యం, చదువు ఉంటే ఆర్థిక స్వావలంబన సాధిస్తారన్నారు. డీఎంహెచ్‌ఓ అప్పయ్య మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉండడానికి ఆడపిల్లలు, మహిళలు మంచి పోషకాహారాన్ని తీసుకోవాలన్నారు. బేటీ బచావో– బేటీ పడావో క్యాలెండర్‌ను అదనపు కలెక్టర్ రవి ఆవిష్కరించారు. సాంస్కృతిక ప్రదర్శనల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అదనపు కలెక్టర్ రవి సర్టిఫికెట్లు, మెడల్స్ అందించారు. డీఐఈఓ గోపాల్, మెప్మా డీపీఎం రజితారాణి, గైనకాలజిస్ట్ రాధిక, ఆయా విభాగాల అధికారులు విశ్వజ, స్వరూప, ఉమాదేవి, కల్యాణి, సుమలత, సింధూరాణి, వెంకటరాము, రవికృష్ణ, స్వర్ణలత, మానస, లావణ్య, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.
బాలికలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారు..
ఎంజీఎం: బాలికలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య అన్నారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా లష్కర్‌సింగారం పీహెచ్‌సీ నుంచి గోపాల్‌పూర్ వరకు నిర్వహించిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. అనంతరం హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో సూపరింటెండెంట్ విజయలక్ష్మితో కలిసి ఆయన ఆడ శిశువులకు అవసరమైన వస్తువులతో కూడిన కిట్ అందించి తల్లిదండ్రులను సత్కరించి అభినందన పత్రం అందించారు. కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రత్యేకంగా రూపొందించిన ‘సంక్షిప్త సందేశాన్ని 386 మంది గర్భిణులను మొబైల్స్‌కు పంపించినట్లు తెలిపారు. ఆర్‌ఎంఓ డాక్టర్ మంజుల, అదనపు డీఎంహెచ్‌ఓ మదన్ మోహన్‌రావు, డీటీసీఓ హిమబిందు, అధికారులు ప్రభుదాస్, శ్రీనివాస్, రుబీనా, అశోక్ రెడ్డి, ప్రసన్న కుమార్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
జాతీయ బాలికా దినోత్సవంలో
హనుమకొండ అదనపు కలెక్టర్ రవి


