రాతికోట కూలిన చోట మరమ్మతులు | - | Sakshi
Sakshi News home page

రాతికోట కూలిన చోట మరమ్మతులు

Jan 23 2026 9:10 AM | Updated on Jan 23 2026 9:10 AM

రాతికోట కూలిన చోట మరమ్మతులు

రాతికోట కూలిన చోట మరమ్మతులు

రాతికోట కూలిన చోట మరమ్మతులు

ఖిలా వరంగల్‌: వారసత్వ సంపదను పరిరక్షించేందుకు ఏఎస్‌ఐ ముందుకొచ్చింది. గత ఏడాది అక్టోబర్‌లో మోంథా తుపాన్‌ ప్రభావం వల్ల ఖిలావరంగల్‌ రాతికోట పశ్చిమ ముఖ ద్వారం వద్ద కూలింది. దీనిని మరమ్మతు చేసేందుకు కేంద్ర పురావస్తుశాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాతికోట కూలిన బండరాళ్లను తిరిగి యథాస్థానంలో అమర్చేందుకు గురువారం పనులు ప్రారంభించింది. చారిత్రక కట్టడాలకు ఎలాంటి నష్టం కలగకుండా నిపుణుల పర్యవేక్షణలో పనులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. బండరాళ్లను పైకి లిఫ్ట్‌ చేసి పాతస్థానంలో అమర్చేందుకు భారీయంత్రాలను వినియోగించనున్నారు. మరమ్మతుల వల్ల స్థానికులకు ఎలాంటి ఆసౌకర్యం కలగకుండా ముందుస్తుగానే బారికేడ్లను ఏర్పాటు చేసి భద్రతా చర్యలు తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement