‘స్నేహ’ను పటిష్టంగా అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

‘స్నేహ’ను పటిష్టంగా అమలు చేయాలి

Jan 23 2026 9:10 AM | Updated on Jan 23 2026 9:10 AM

‘స్నేహ’ను పటిష్టంగా అమలు చేయాలి

‘స్నేహ’ను పటిష్టంగా అమలు చేయాలి

‘స్నేహ’ను పటిష్టంగా అమలు చేయాలి

హనుమకొండ కలెక్టర్‌ స్నేహ శబరీష్‌

హన్మకొండ అర్బన్‌: కిశోర బాలికలు, బాలుర కోసం జిల్లాలో చేపట్టిన ‘స్నేహ’ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని హనుమకొండ కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో డీఆర్‌డీఓ, సెర్ప్‌, ఇందిరా మహిళాశక్తి మిషన్‌లో భాగంగా స్నేహ కార్యక్రమం గురువారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. 15–18 సంవత్సరాల వయస్సున్న కిశోర బాలబాలికలకు కౌన్సెలింగ్‌తో పాటు వైద్య పరీక్షలు చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రైవేట్‌ పాఠశాలల్లోనూ స్నేహ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. డీఆర్డీఓ మేన శ్రీను, డీడబ్ల్యూఓ జయంతి, డీఈఓ గిరిరాజ్‌ గౌడ్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ బాలరాజు, బీసీ వెల్ఫేర్‌ అధికారి నరసింహస్వామి, డీఐఈఓ గోపాల్‌, జిల్లా యువజన, క్రీడల అధికారి అశోక్‌కుమార్‌, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్‌సింగ్‌, మెప్మా డీఎంసీ రజితారాణి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు మదన్మోహన్‌రావు, ప్రదీప్‌రెడ్డి, డీఆర్డీఏ డీపీఎం పద్మప్రియ తదితరులు పాల్గొన్నారు.

పదిలో వంద శాతం ఫలితాలు సాధించాలి..

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా అధికారులు, ప్రధానోపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన అధికారుల సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక శ్రద్ధతో బోధించాలని, స్లిప్‌ టెస్టులు నిర్వహించి వారి అభ్యసన స్థాయిని మెరుగుపరచాలని ఆదేశించారు. ఆంగ్ల భాషలో విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించాలని సూచించారు. సమావేశంలో డీఈఓ గిరిరాజ్‌, అసిస్టెంట్‌ కంట్రోలర్‌ ఫర్‌ గవర్నమెంట్‌ ఎగ్జామ్స్‌ భువనేశ్వరి, ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు రామకృష్ణ, జీసీడీఓ సునీత, ఎంఐఎస్‌ కోఆర్డినేటర్‌ మహేశ్‌, ఏఎస్సీ రఘుచంద్రారావు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement