వినతులు త్వరగా పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

వినతులు త్వరగా పరిష్కరించాలి

Jan 20 2026 8:29 AM | Updated on Jan 20 2026 8:29 AM

వినతులు త్వరగా పరిష్కరించాలి

వినతులు త్వరగా పరిష్కరించాలి

వినతులు త్వరగా పరిష్కరించాలి

న్యూశాయంపేట: వినతులు త్వరగా పరిష్కరించాలని వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన సత్యశారద వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ శాఖ 26, జీడబ్ల్యూఎంసీ 18, ఇతర శాఖలకు సంబంధించినవి 27 (మొత్తం 71) వినతులు రాగా.. ఆయా శాఖల అధికారులకు ఎండార్స్‌ చేశారు. పెండింగ్‌ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కాగా, గంగదేవిపల్లిలో నిర్వహించే సర్పంచ్‌ల శిక్షణను కలెక్టర్‌ ప్రారంభించి గ్రీవె న్స్‌కు ఆలస్యంగా రావడం, అధికారులూ ఆలస్యంగా రావడంతో ఫిర్యాదుదారులు ఇబ్బందులు ప డ్డారు. ఇద్దరు కుమారులు, కుమార్తె తమ బాగోగులు చూసుకోవడం లేదని వరంగల్‌ కొత్తవాడకు చెందిన ఎ.మల్లికాంబ కలెక్టర్‌కు విన్నవించారు.

ప్రజావాణికి 100 వినతులు

హన్మకొండ అర్బన్‌: హనుమకొండ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అధికారులు 100 వినతులు అందాయి. డీఆర్‌ఓ వైవీ గణేశ్‌, ఇతర అధికారులు వినతులు స్వీకరించారు. గణేశ్‌, డీఆర్డీఓ మేన శ్రీను, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్‌ రమేశ్‌, ఇతర అధికారులు హాజరయ్యారు. అర్జీలను సకాలంలో పరిష్కరించేలా శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని డీఆర్‌ఓ వై.వి. గణేశ్‌ అన్నారు.

వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement