బుజ్జగింపులు.. నజరానాలు
హసన్‌పర్తి: ఎన్నికల నామినేషన్ ఉపసంహరించడానికి ఆయా పార్టీల నుంచి పోటీ చేస్తున్న వారు ప్రయత్నాలు ప్రారంభించారు. రెండో దశ నామినేషన్ల ఘట్టం శుక్రవారం ముగియనుంది. ఆయా గామాల్లో సర్పంచ్ పదవి కోసం అధికార పార్టీకి చెందిన పోటీదారుల నుంచి తీవ్ర పోటీ నెలకొంది. సర్పంచ్ పదవి కోసం అధికార పార్టీలోనే పోటీ ఎక్కువైంది. వీరిని బుజ్జగించడానికి మండలానికి చెందిన సీనియర్ నాయకులు రంగంలోకి దిగారు. ఇదిలా ఉండగా.. నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఆయా పార్టీల నాయకులు ఇరువురు పోటీదారులతో మంతనాలు సాగిస్తున్నారు. నామినేషన్ ఉపసంహరిచుకుంటే నజరానాలు కూడా ప్రకటిస్తున్నారు.
మద్దతు కోసం ఒత్తిడి
కష్టకాలంలో పార్టీని కాపాడిన తమకు మద్దతివ్వాలని ఆయా గ్రామాల్లో సీనియర్ల నుంచి డిమాండ్ వ్యక్తమవుతోంది. పదేళ్ల పాటు బీఆర్‌ఎస్ నాయకుల వేధింపులు భరించిన తమకే పార్టీ మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. మరో వైపు పార్టీలో చేరిన వారు సైతం తమకు మద్దతు పలికాలని కోరుతున్నారు. మద్దతు ఇవ్వకుంటే మరో పార్టీలోకి జంప్ చేస్తామని అభ్యర్థులను హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బైరాన్‌పల్లి, సీతంపేట, అన్నాసాగరం, మల్లారెడ్డిపల్లిల్లో అధికార ప్రతిపక్షాల నుంచి నామినేషన్ దాఖలు చేసిన వారి నుంచి డిమాండ్ వ్యక్తమవుతోంది. రెండు రోజుల క్రితం బైరాన్‌పల్లిలో సర్పంచ్ పదవి ఆశిస్తూ నామినేషన్ దాఖలు చేసిన అధికార పార్టీకి చెందిన పోటీదారుల నుంచి ఒకరిని ఉపసంహరించుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. గంటూరుపల్లిలో ఏకంగా సర్పంచ్ పదవి కోసం వేలం వేయగా బెడిసి కొట్టింది. చివరికి ఆరుగురు నామినేషన్ వేశారు. సూదన్‌పల్లిలో తల్లి, కూతురు, కొడళ్లు సర్పంచ్ పదవి కోసం నామినేషన్లు వేశారు. చివరికి వీరు పోటీల్లో ఉంటారా? ఒకరికే మద్దతు ప్రకటిస్తూ మిగతా ఇద్దరు నామినేషన్లు ఉపసంహరించుకుంటారా? అనే చర్చ జరుగుతోంది.
వేటుకు రంగం సిద్ధం..
పార్టీ ఆదేశాలు ధిక్కరించి బరిలో ఉండే వారిపై వేటుకు ఆయా పార్టీలు రంగం సిద్ధం చేసినట్లు తె లిసింది. పోటీదారులు కూడా అఽధిష్టానం వద్ద మొరపెట్టుకున్నట్లు సమాచారం. ఒకే పార్టీ పేరు చెబుతూ.. ఓట్లు అడిగినట్లయితే ఓటర్లు గందరగోళపడే అవకాశం ఉన్నట్లు పార్టీ భావిస్తోంది.
ఏకగ్రీవం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు
మద్దతివ్వకుంటే పార్టీ
మారుతామని బెదిరింపు


