కొలతలు పక్కాగా నమోదు చేయాలి
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్
వరంగల్ అర్బన్: భవన నిర్మాణాల అసెస్మెంట్ల కొలతలు పక్కాగా నమోదు చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. గురువారం హంటర్ రోడ్డు ప్రాంతంలో న్యూశాయంపేట జంక్షన్ విల్లాస్ రోడ్, భద్రకాళి బండ్ వైపు వెళ్లే ప్రాంతాల్లో నమోదు చేసిన అసెస్మెంట్ల కొలతలను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమర్థవంతంగా లెక్కించాలని సూచించారు. ఈసందర్భంగా బల్దియా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు నమోదు చేసిన కొలతలను కమిషనర్ పునఃపరిశీలించి నిర్ధారణ చేసి నమోదు తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. నూతనంగా నిర్మించిన భవనాలకు పర్మిషన్ డాక్యుమెంట్లను, అనధికారిక నిర్మాణాలను పరిశీలించి అందుకు అనుగుణంగా వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఈ తనిఖీల్లో డిప్యూటీ కమిషనర్ రవీందర్ ఆర్‌ఐ రజనీ, వార్డు ఆఫీసర్ శిరీష బిల్ కలెక్టర్ రాజేశ్, తదితరులు పాల్గొన్నారు.


