క్రీడాభివృద్ధి కోసం కృష్ణమూర్తి
డోర్నకల్‌లో పుట్టి పెరిగిన మండలోజు కృష్ణమూర్తి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించి రైల్వేలో 35 ఏళ్లకుపైగా ఉద్యోగం చేసి రిటైరయ్యారు. రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్‌లో ఉపాధ్యక్షుడిగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా, జాతీయ రీఫరీగా పని చేస్తున్నారు. ఏడు పదుల వయస్సులోనూ ఎక్కడా రాజీ పడకుండా వెయిట్ లిఫ్టింగ్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ఎంతో మంది క్రీడాకారులను తయారు చేసి వివిధ పోటీలకు పంపించి అవార్డులు దక్కించుకునేలా సహకరిస్తున్నారు. ఉద్యోగ విరమణతో ఇంటికే పరిమితం కాకుండా తనకున్న అనుభవాన్ని క్రీడా అభివృద్ధికి ఉపయోగిస్తున్నారు.


