పూడిక తీయించండి
వరంగల్ అర్బన్: వరంగల్‌లోని నర్సంపేట రోడ్డులో స్మార్ట్ సిటీ నిధులతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ మురుగు నీరు స్తంభించకుండా అత్యాధునిక యంత్రాలతో పూడిక తీయిస్తామని మేయర్ గుండు సుధారాణి తెలిపారు. ఈనెల 17న ‘ఆకర్షణీయం.. భూగర్భశోకం’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి స్పందించిన మేయర్ సుధారాణి శనివారం బల్దియా ఇంజనీర్లు, ప్రజారోగ్యం అధికారులు, సిబ్బందితో కలిసి భూగర్భ డ్రెయినేజీని తనిఖీ చేశారు. అప్పటికప్పుడు వాహనాలు రప్పించి పూడికతీత పనులు చేయించారు.
పూడిక తీయించండి


