సీనియర్లతో ఫ్రెండ్లీగా ఉండాలి
వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి
నిర్మలాగీతాంబ
హసన్‌పర్తి: జూనియర్ విద్యార్థులు సీనియర్లతో స్నేహపూర్వకంగా ఉండాలని వరంగల్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి, వీబీ.నిర్మలా గీతాంబ అన్నారు. నగరంలోని ఎస్‌వీఎస్ విద్యాసంస్థలో ‘చట్టాలపై అవగాహన యువతపై ప్రభావం’ అంశంపై నార్కొటిక్స్, పోక్సో, యాంటీ–ర్యాంగింగ్‌పై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నిర్మలాగీతాంబ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ డాక్టర్ ఎర్రబెల్లి తిరుమల్‌రావు, కళాశాల వైస్ చైర్మన్ డాక్టర్ ఎర్రబెల్లి సువర్ణ, సీనియర్ జడ్జి సాయికుమార్, సివిల్ జడ్జి ఉషా క్రాంతి, నార్కొటిక్ డీఎస్పీ రమేశ్‌కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పులి సత్యనారాయణ, పోక్సో–భరోసా ప్రతినిధి శ్రావణి తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ కడియం కావ్య
ధర్మసాగర్: వరంగల్ నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. మండలంలోని ఉనికిచర్ల గ్రామ శివారులో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న యూనిసిటీ వెంచర్ అభివృద్ధి, బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.10 కోట్లతో చేపట్టనున్న పనులకు ఎంపీ కడియం కావ్య, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ చాహత్ బాజ్‌పాయ్, ‘కుడా’ అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు కొత్తగా కేటాయించిన మొబైల్ ఫోరెన్సిక్ రెండో వాహనాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ శనివారం తన కార్యాలయంలో జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం అందుబాటులో ఉన్న పరిజ్ఞానాన్ని వినియోగించుకుని అత్యాధునిక పరికరాలతో రూపొందించిన ఈ మొబైల్ ఫోరెన్సిక్ వాహనం వరంగల్ కమిషనరేట్ పోలీసులకు మరింత మెరుగైన సేవలందిస్తుందన్నారు. నేరం జరిగిన ప్రదేశానికి ఫోరెన్సిక్, ఫింగర్ ప్రింట్ అధికారులు, సిబ్బంది ఈ మొబైల్ ఫోరెన్సిక్ వాహనంలో చేరుకుని రక్తమరకలు, వేలిముద్రలతోపాటు ఇతర సాక్ష్యాధారాలను సేకరిస్తారన్నారు. వాటిని ఈ మొబైల్ వాహనంలోని ఆధునిక పరికరాలతో పరీక్షించి సంబంధిత దర్యాప్తు అధికారికి ప్రాథమిక సాక్ష్యాధారాలను అందజేస్తారన్నారు. కార్యక్రమంలో డీసీపీలు అంకిత్ కుమార్, గుణశేఖర్, అదనపు డీసీపీలు రవి, ప్రభాకర్, శ్రీనివాస్‌తోపాటు ఏసీపీలు, ఆర్‌ఐలు, ఫింగర్ ప్రింట్ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ సెంట్రల్ జోన్ డీసీపీగా దార కవితను ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రస్తుతం కవిత హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ విభాగంలో పని చేస్తున్నారు. బదిలీపై వచ్చిన డీసీపీ కవిత సోమవారం విధుల్లో చేరనున్నట్లు సమాచారం.
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో నేషనల్ మీన్స్‌కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) పరీక్ష ఈనెల 23న నిర్వహించనున్నారు. ఈపరీక్ష నిర్వహణకు నాలుగు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖ అధికారి ఎ.వెంకటరెడ్డి శనివారం తెలిపారు. పరీక్ష కేంద్రాలుగా హనుమకొండప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ప్రాక్టీసింగ్ హై స్కూల్, పరకాలలోని ఎస్‌ఆర్ హైస్కూల్‌లో ఏర్పాటు చేశారు. జిల్లాలో ఎన్‌ఎంఎంఎస్ ప రీక్షకు 750 మంది విద్యార్థులు హాజరవ్వనున్నారు.
సీనియర్లతో ఫ్రెండ్లీగా ఉండాలి
సీనియర్లతో ఫ్రెండ్లీగా ఉండాలి
సీనియర్లతో ఫ్రెండ్లీగా ఉండాలి


