అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌కు రోహిణి
ఖిలా వరంగల్: డిసెంబర్ 12 నుంచి 15 వరకు హాంకాంగ్ యునెస్కో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘మోడల్ ఎథిక్స్ ఆఫ్ న్యూరో టెక్నాలజీ’ కాన్ఫరెన్స్‌కు రాష్ట్రం తరఫున వరంగల్ పెరకవాడకు చెందిన రంగరాజు రోహిణి ఎంపికై ంది. రోహిణి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆమె ఎంపికైంది. ఈమేరకు శుక్రవారం పెరకవాడలో ఆమెను యూనెస్కో తెలంగాణ స్టేట్ చాప్టర్ కో–ఆర్డినేటర్ ధర్మపురి రాజగోవింద్, నేషనల్ యూత్ అవార్డు గ్రహీత మండల పరశురాములు ఘనంగా సన్మానించారు. పేద విద్యార్థి రోహిణి అంతర్జాతీయ సదస్సుకు హాజరయ్యేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని వారు కోరారు.
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ విభాగాలను శుక్రవారం ప్రిన్సిపాల్ టి.మనోహర్‌తో కలిసి వీసీ కె.ప్రతాప్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మైక్రోబయాలజీ విద్యార్థులతో తరగతులు ఎలా జరగుతున్నాయి? అని అడిగి తెలుసుకున్నారు. బయోటెక్నాలజీ విభాగంలో విద్యార్థులతో మాట్లాడారు. కేయూలో ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటవుతోందని, దీనిని సైన్స్, బయోటెక్నాలజీ విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు.
కాజీపేట అర్బన్ : విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని హనుమకొండ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి గౌస్ హైదర్ తెలిపారు. కాజీపేట మండలం కడిపికొండలోని తెలంగాణ మైనార్టీ గురుకుల బాలుర పాఠశాలను శుక్రవారం ఆయన సందర్శించారు. తరగతి గదులు, వంట గదితోపాటు వసతులు పరిశీలించి మాట్లాడారు. పాఠశాలలో నిర్వహిస్తున్న ఎన్‌సీసీ పరేడ్‌ను పరిశీలించి అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ తనుగుల శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కాజీపేట: కాజీపేట 63వ డివిజన్ వడ్డెర బస్తీలో శుక్రవారం వీధి కుక్కలు నలుగురిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. రాకేశ్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై కుట్టు మిషన్ బాగు చేయించడానికి ఓ ఇంటికి వెళ్తుండగా.. వడ్డెర బస్తీలో రహదారిపై కుక్కలు వెంటపడ్డాయి. అదే సమయంలో అటుగా వచ్చిన సత్యనారయణ అనే పోలీస్ అధికారి అతడిని కాపాడడానికి ప్రయత్నించగా కుక్కలు ఇద్దరిపై దాడిచేసి తీవ్రంగా గాయపర్చాయి. వీరితో పాటు మరో ఇద్దరిపై అవే కుక్కలు దాడిచేశాయి. వడ్డెర బస్తీలో విచ్చలవిడిగా కుక్కలు తిరుగుతున్నాయని, వాటి బారి నుంచి తమకు రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
హన్మకొండ అర్బన్: హనుమకొండ జేఎన్‌ఎస్‌లో ఇటీవల నిర్వహించిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ విజయవంతం కావడంతో శుక్రవారం కలెక్టర్ స్నేహ శబరీష్‌ను ఆర్మీ అధికారులు కలిసి ధన్యవాదాలు తెలిపారు. కల్నల్ సునీల్ యాదవ్, మేజర్ ప్రకాశ్ చంద్రరాయ్ తదితర అధికారులు కలెక్టర్‌కు జ్ఞాపిక అందజేశారు.
అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌కు రోహిణి


