‘మారథాన్’ను విజయవంతం చేయాలి
హన్మకొండ: వరంగల్ మహానగరంలో తొలిసారిగా నిర్వహించనున్న హాఫ్ మారథాన్‌ను విజయవంతం చేయాలని మారథాన్ నిర్వాహక కమిటీ ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డి కోరారు. హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రెడాయ్ వరంగల్ సౌజన్యంతో తెలంగాణ రన్నర్స్, వరంగల్ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 23న నిర్వహించనున్న హాఫ్ మారథాన్ 21, 10, 5 కిలో మీటర్లుగా ఉంటుందన్నారు. ఆదివారం ఉదయం 5 గంటలకు హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రం నుంచి మారథాన్ ప్రారంభమవుతుందన్నారు. అనంతరం మారథాన్ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో మారథాన్ రన్నర్స్ జగన్ మోహన్ రెడ్డి, డాక్టర్ సుధాకర్, ఉదయ్ రెడ్డి, రవి, చరణ్, సరస్వతి, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.
రేపు ట్రాఫిక్ మళ్లింపు
వరంగల్ క్రైం: నగరంలో ఈనెల 23న హాఫ్ మారథాన్ ఉన్నందున ఉదయం 4 గంటల నుంచి 10 గంటల వరకు కాజీపేట, హనుమకొండ, వరంగల్ ట్రై సిటీ పరిధి పలు చోట్ల ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని సీపీ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు.
● హైదరాబాద్ నుంచి హనుమకొండకు వచ్చే వాహనాలు/బస్సులు ఫాతిమానగర్ నుంచి వడ్డేపల్లి చర్చి రూట్ మీదుగా తులసీ బార్– కేయూ జంక్షన్– నయీంనగర్– సీపీఓ జంక్షన్ మీదుగా బస్టాండ్‌కు చేరుకోవాలని సూచించారు.
● హనుమకొండ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వాహనాలు/బస్సులు అశోకా జంక్షన్ మీదుగా ములుగురోడ్డు–పెద్దమ్మగడ్డ – కేయూసీ – తిరుమల బార్–వడ్డేపల్లి చర్చి–ఫాతిమా సెంటర్– కాజీపేట మీదుగా హైదరాబాద్‌కు వెళ్లాలి.
● హనుమకొండ నుంచి కరీంనగర్ వైపు వెళ్లే వాహనాలు/బస్సులు ములుగు రోడ్డు – పెద్దమ్మగడ్డ – కేయూసీ మీదుగా వెళ్లాలి.
● ఖమ్మం నుంచి హనుమకొండ వచ్చే వాహనాలు/బస్సులు సీఎస్‌ఆర్ గార్డెన్ జంక్షన్ నుంచి డైవర్షన్ తీసుకుని పోతన జంక్షన్ వైపు నుంచి హనుమకొండకు వెళ్లాలి.
కాగా, వంద ఫీట్ల రోడ్డులో ఒకవైపు నుంచి మాత్రమే వాహనాలు అనుమతించనున్నట్లు, సీఎస్‌ఆర్ గార్డెన్ జంక్షన్ నుంచి అదాలత్ వైపు, అంబేడ్కర్ జంక్షన్ నుంచి కాళోజీ జంక్షన్ వరకు, ఫాతిమా జంక్షన్ నుంచి ఎన్‌ఐటీ వైపునకు ఈ సమయాల్లో ఎలాంటి వాహనాలకు అనుమతి ఉండదని సీపీ పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
నిర్వాహక కమిటీ ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డి


