రూ.1,200 కోట్లతో డీపీఆర్ సిద్ధం
ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి..
వరంగల్ అర్బన్ : వరంగల్ నగర వరద ముంపు శాశ్వత పరిష్కారానికి రూ.1,200 కోట్లతో డీపీఆర్ సిద్ధమైందని, అనుసంధానంగా భూగర్భ డ్రెయినేజీ (యూజీడీ) ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని నగర మేయర్ గుండు సుధారాణి తెలిపారు. శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాలను తెలంగాణ కై ్లమేట్ రెసిడెంట్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇన్షియేటివ్ (టీజీ–సీయూఆర్టీఐ) ఆధ్వర్యంలో ‘ప్రాథమిక అంచనా మిషన్‘కు చెందిన అర్బన్ డెవలప్మెంట్ సౌత్ ఏసియా హెడ్ ఆఫీస్‌కు చెందిన కార్లా బెర్క్, అర్బన్ మొబిలిటీ హెడ్ న్యూఢిల్లీకి చెందిన ఆళ్వారో చెర్రీల్, అర్బన్ డెవలప్మెంట్ సౌత్ ఏసియా పోర్ట్‌ఫోలియో లూకాస్ మయి, సీనియర్ అర్బన్ సెక్టార్ స్పెషలిస్ట్ న్యూ ఢిల్లీకి చెందిన కిరణ్ అవధానులతో కలిసి పరిశీలించారు. భూగర్భ డ్రెయినేజీ, నగర స్థితిగతులపై అధ్యయనం చేశారు. అనంతరం మేయర్ చాంబర్‌లో మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్, ప్రతినిధులు, అధికారులతో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. సీవరేజ్ ప్రాజెక్టులు, నీటి సరఫరా, ఘన వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలపై దృశ్య మాధ్యమం ద్వారా ప్రతినిధులకు వివరించారు. నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులు వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ అభివృద్ధిపై చిత్తశుద్ధితో ఉన్నారని చెప్పారు. ‘మోంథా తుపానుతో నగరంలో జరిగిన నష్టాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా పరిశీలించి తక్షణ సహాయంగా రూ.12కోట్ల నిధులను విడుదల చేసినట్లు తెలిపారు.
నీటి సరఫరాకు రూ.544 కోట్లు
మహానగరవ్యాప్తంగా నీటి సరఫరా కోసం రూ.544 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. సాస్కి కార్యక్రమంలో భాగంగా పురాతన బావులను 15 పునరుద్ధరించామని మేయర్ తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ సాయినాథ్, అదనపు డైరెక్టర్ ఫణి, ఎస్‌ఈ సత్యనారాయణ, సీఎంహెచ్‌ఓ డా.రాజారెడ్డి, సీహెచ్‌ఓ రమేష్, డీఎఫ్‌ఓ శంకర్ లింగం, అధికారులు రవీందర్ రాడేకర్, మాధవి లత, హర్షవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.
నగర మేయర్ గుండు సుధారాణి
విదేశీ, స్వదేశీ నిపుణులతో సమావేశం


