వీసీలో రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని
హన్మకొండ అర్బన్/న్యూశాయింపేట : స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకతవకలకు అవకాశం లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి, ఇతర ఎన్నికల అధికారులతో కలిసి ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాణి కుముదిని మాట్లాడుతూ.. ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాటు చేయాలన్నారు.ఎన్నికల సమయంలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఎన్నికల ప్రవర్తన నియామవళి పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. హనుమకొండ కలెక్టరేట్‌నుంచి కలెక్టర్ స్నేహశబరీష్, అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, డీపీఓ లక్ష్మీ రమాకాంత్, జెడ్పీ సీఈఓ రవి, ఏసీపీ నర్సింహారావు, వరంగల్ కలెక్టరేట్‌నుంచి కలెక్టర్ డాక్టర్ సత్యశారద, డీసీపీ అంకిత్‌కుమార్, అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్వో విజయలక్ష్మి, డీపీఓ కల్పన, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి పాల్గొన్నారు.
ఓటర్ల రివిజన్‌పై సమావేశం
ఓటర్ల రివిజన్‌పై వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద గురువారం కలెక్టరేట్‌లో ఆర్డీఓలు, ఈఆర్వోలు, అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, ఎలక్షన్ డీటీ రంజిత్‌కుమార్, రాజకీయ పార్టీల ప్రతినిధులు తక్కళ్లపల్లి రవీందర్‌రావు (కాంగ్రెస్), కె.శ్యాం (టీడీపీ), బాకం హరిశంకర్(బీజేపీ), రజనీకాంత్ (వైఎస్సార్ సీపీ), అనిల్‌కుమార్ (బీఎస్పీ) పాల్గొన్నారు.


