‘అన్వేషిక’లో పరమేశ్వర్..
ప్రయోగదర్శిని పుస్తక రూపకల్పనలో వరంగల్ జిల్లాకు చెందిన టీచర్
కాళోజీ సెంటర్ : ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో ప్రయోగపూర్వకంగా శాసీ్త్రయ జ్ఞానం, నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఎస్‌సీఈఆర్‌టీ ఆరు నుంచి పదో తరగతి వరకు భౌతిక, రసాయన, జీవశాస్త్రాలకు ల్యాబ్ మాన్యువల్ అయిన అన్వేషిక ప్రయోగదర్శిని అనే పుస్తకాన్ని రూపొందించింది. ఇందులో ప్రయోగ అంశాలు, కృత్యాలను పొందుపరిచారు. వీటిని ఎలా చేయాలి? కావాల్సిన పరికరాలు ఏమిటి? అందులో ఉన్న శాసీ్త్రయ సూత్రం ఏమిటి? ఫలితాలు, నిర్ధారణ వంటి అంశాలను పొందుపరుస్తూ విపులంగా ప్రతీ కృత్యానికి వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో ఈ ప్రయోగదర్శిని రూపకల్పనలో రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది భౌతిక శాస్త్ర, జీవశాస్త్ర ఉపాధ్యాయులు (విషయ నిపుణులు) పాల్గొన్నారు. ఇందులో వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగాపురం జెడ్పీ హైస్కూల్ జీవ శాస్త్ర ఉపాధ్యాయుడు చిప్ప పరమేశ్వర్ 8వ తరగతి ప్రయోగదర్శినిని రూపొందించారు. కాగా, ఇటీవల పాఠశాలలకు ఈ ప్రయోగదర్శిని పుస్తకాలను అందించారు.
6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్రయోగపాఠాలు అమలు చేసేలా నిపుణులతో రూపొందించిన ప్రయోగదర్శిని పుస్తకంలో ఉన్న విశేషాలను ఉపాధ్యాయులు, విద్యార్థులు సంవత్సర నుంచి తెలుసుకుంటున్నారు. ఇవి రూపొందించిన విషయ నిపుణుల బృందంలో వరంగల్ జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు పరమేశ్వర్ ఉండడం జిల్లా విద్యాశాఖకు గర్వకారణం. పరమేశ్వర్‌కు జిల్లా విద్యాశాఖ తరఫున అభినందనలు.
– డాక్టర్ కట్ల శ్రీనివాస్, సైన్స్ అధికారి వరంగల్
విద్యార్థులు, టీచర్లకు ఉపయోగపడేలా ఉభయతారకంగా ఈ అన్వేషిక ప్రయోగదర్శిని ఉంటుంది. ఈ పుస్తకం రూపకల్పనలో పాల్గొనడం వృత్తి జీవితంలో ఇంకొక మెట్టు ఎక్కినట్లు అనిపిస్తోంది. 8వ తరగతికి సంబంధించిన కృత్యాలు, ప్రయోగాలకు సంబంధించిన ప్రయోగ పద్ధతి, పరికరాలు, శాసీ్త్రయ సూత్రం, ఫలితాలు, తదితర అంశాలు రాశా. 18 సంవత్సరాల నా బోధన అనుభవంలో తరగతి గదిలో ప్రయోగాల్లో నేను చేసిన కృత్యాలు, ఎదుర్కొన్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ల్యాబ్ మాన్యువల్‌ను రచించా. పుస్తక రచనలో పాల్గొనే అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నా.
– చిప్ప పరమేశ్వర్, జీవశాస్త్ర ఉపాధ్యాయుడు
విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఉభయతారకంగా అన్వేషిక బుక్
పుస్తక రూపకల్పనలో జిల్లా టీచర్ పాల్గొనడం గర్వకారణం : డీఈఓ
‘అన్వేషిక’లో పరమేశ్వర్..
‘అన్వేషిక’లో పరమేశ్వర్..


