జాతర పనుల్లో వేగం పెంచాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం జాతర పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. మేడారంలో జరుగుతున్న జాతర అభివృద్ధి పనులను సోమవారం అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మేడారం ఐటీడీఏ కార్యాలయంలో జాతర అభివృద్ధి పనులపై ఎస్పీ శబరీశ్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. జాతర పనుల పురోగతిపై ఆయాశాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతర సమయం దగ్గర పడుతోందని, పనుల్లో మరింత వేగం పెంచాలని ఆదేశించారు. డిసెంబర్‌కల్లా పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. జాతర అభివృద్ధి పనులతోపాటు అమ్మవార్ల గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణ పనులపై పూజారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. అంతకుముందు మంత్రి సీతక్క అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు. సమావేశంలో ఆర్డీఓ వెంకటేష్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి, ఈఓ వీరస్వామి, సీఐ దయాకర్, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క


