కౌమర బాలికలకు సాధికారత కల్పించాలి
కాజీపేట రూరల్ : కౌమర బాలికలకు సమాజంలో సాధికారత కల్పించి ప్రోత్సాహించాలని సెర్ప్ అదనపు సీఈఓ కాత్యాయని దేవి అన్నారు. ఫాతిమానగర్ బాలవికాస కేంద్రంలో ఏడు జిల్లాలకు నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న కౌమర బాలికల సంఘాల తయారీలో భాగంగా సోమవారం స్నేహ వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాత్యాయని దేవి మాట్లాడుతూ.. బాలికలకు విద్య, మార్గదర్శకత్వం, ఉపాధిని కొనసాగించేలా చేయాలన్నారు. యూనిసెఫ్ విభాగం నుంచి మురళి, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ జోన్స్ టెక్నికల్ కన్సల్టెంట్, సెర్ప్ హెచ్‌డీ విభాగం నుంచి లింగయ్య గౌడ్, హనుమకొండ, వరంగల్ జిల్లాల అదనపు ఆర్డీఓలు సరిత, 7జిల్లాల డీపీఎంలు, ఏపీఎంలు మాట్లాడారు. ప్రపంచంలోనే భారత్ అధిక కౌమర జనాభా ఉన్న దేశమని, వారి అవసరాలు, ఆలోచనలు, ప్రస్తుత సామాజిక మాధ్యమం ఇంటర్నెట్, సమాచార ఏఐ యుగం, డ్రగ్స్ మద్యం, వ్యసనాలు, సేఫ్టీ, న్యూట్రిషన్, ఎంపవర్‌మెంట్ అండ్ హెల్త్ తదితర విషయాలపై పనిచేసి వారి సంఘాలు ఏర్పాటు చేసి అభివృద్ధి వైపు నడిపించాలన్నారు. కార్యక్రమంలో జయశంకర్, భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, వరంగల్, ములుగు, హనుమకొండ, కొమురంభీమ్, ఆసిఫాబాద్ నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు.
సెర్ప్ అదనపు సీఈఓ కాత్యాయనిదేవి


