
కార్తీక మాసోత్సవాలు షురూ
నగరంలోని పలు ఆలయాల్లో బుధవారం కార్తీక మాసోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. హనుమకొండలోని రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల ఆలయంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, నీలిమ దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్తీక మాసోత్సవాలను ప్రారంభించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకుడు మణికంఠశర్మ పూజలు నిర్వహించారు. మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. ఆలయ ఈఓ అనిల్‌కుమార్ పర్యవేక్షించారు. కార్పొరేటర్ వెంకటేశ్వర్లు, సరళాయాదవ్, రవీందర్‌రెడ్డి, కుమార్‌యాదవ్ పాల్గొన్నారు. అదేవిధంగా శ్రీభద్రకాళి దేవాలయంలో బుధవారం రాత్రి ఈఓ రామల సునీత దీపోత్సవాన్ని ప్రారంభించారు.
– హన్మకొండ కల్చరల్