అమరుల త్యాగాలు మరువలేనివి
టీజీఎస్పీ నాలుగో బెటాలియన్ కమాండెంట్
శివప్రసాద్‌రెడ్డి
మామునూరు: అమరవీరుల త్యాగాలు మరువలేనివని కమాండెంట్ శివప్రసాద్‌రెడ్డి అన్నారు. విద్యార్థి దశ నుంచే సామాజిక విలువలు, హక్కులు, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా బుధవారం మామునూరు టీఎస్పీ నాలుగో బెటాలియన్ ఆవరణలో టీఎస్‌ఎప్పీ పరిపాలన విభాగం అధికారుల ఆధ్వర్యంలో ఓపెన్‌హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కమాండెంట్ శివప్రసాద్‌రెడ్డి హాజరై ఓపెన్‌హౌస్ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. చదువుతోనే సమాజంలో గుర్తింపు వస్తుందని చెప్పారు. అనంతరం పలు రకాల ఆయుధాలను ప్రదర్శించారు. విద్యార్థులకు అధునాతన ఆయుధాలు, వాటి పనితీరు, చట్టాలు, కేసులు, రికార్డులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


