
వేయిస్తంభాల ఆలయంలో మాసశివరాత్రి పూజలు
హన్మకొండ కల్చరల్ : శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల ఆలయంలో ఆదివారం మాసశివ రాత్రిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, శివకల్యాణం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు మణికంఠ అవధాని, అర్చకులు ప్రణవ్, సందీప్‌శర్మ ఉదయం ప్రభాతసేవ, ఉత్తిష్టగణపతికి ఆరాధన గరికపూజ, శ్రీరుద్రేశ్వరుడికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం చేశారు. అనంతరం నాట్యమండపంలో శ్రీ రుద్రేశ్వరిదేవి, శ్రీ రుద్రేశ్వర స్వామివారిని ప్రతిష్ఠించి కళశ స్థాపన, బాసికధారణ, యజ్ఞోపవితధారణ, పాదప్రక్షాళణ, జీలకర బెల్లం, మాంగళ్యధారణ, అక్షతారోహణ, మహాహారతి జరిపి శ్రీరుద్రేశ్వరిదేవి, శ్రీరుద్రేశ్వరస్వామి వార్లకు కల్యాణోత్సవం నిర్వహించారు. సెలవు దినం కావడంతో అధికసంఖ్యలో భక్తులు దేవాలయాన్ని సందర్శించారు. ఈఓ అనిల్‌కుమార్ పర్యవేక్షించారు. సిబ్బంది మధుకర్, రామకృష్ణ పాల్గొన్నారు.
హన్మకొండ : అపార్ట్మెంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నక్కలగుట్టలోని మారుతి టవర్స్‌లో అసోసియేషన్స్ సర్వసభ్య సమావేశం నిర్వహించి, నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రెంటాల కేశవరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నడుముల విజయ్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా తిరవరంగం ప్రభాకర్, కోశాధికారిగా రాజ్‌కుమార్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎస్.కృపాకర్ రావు, డీ.వీ.ప్రసాద్, మర్రి రెడ్డి, జి.శ్రీనివాస్, వి.నరేందర్ రెడ్డి, బి.శివశంకర్, స్వరూప, జాయింట్ సెక్రటరీలుగా ఎం.జనార్దన్ రెడ్డి, పి.నరేందర్ రెడ్డి, కె.సత్యనారాయణ రెడ్డి, ఎం.శ్రీనివాసులు, డి.సారంగపాణి, కె.అశోక్ రెడ్డి, ఆర్.సత్యనారాయణ, ఎస్.మాధవి, పద్మజతో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.