దాడులను ఖండిస్తున్నాం..
జనగామ: ప్రభుత్వం చేసే మంచి, చెడులను ప్రజలకు తెలియజేస్తూ, మనకు దారి చూపించే పత్రికలపై ఏపీ సర్కార్ తీరు సరికాదు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి, జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేయడాన్ని ఖండిస్తున్నాం. సమాజంలో పత్రికలే మార్గదర్శకంగా ఉండి మనల్ని నడిపిస్తున్నాయి.
–పెండెల శ్రీనివాస్, గ్రామ పరిపాలన ఆఫీసర్,
రాష్ట్ర నాయకుడు, జనగామ
కేసుల నమోదు సరికాదు
ములుగు రూరల్: సాక్షి కార్యాలయాలపై ఏపీ ప్రభుత్వం దాడులు చేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుంది. సమాజంలో జరుగుతున్న అక్రమాలను ప్రజ లకు తెలియజేసే పత్రికలపై దాడులు, ఎడిటర్‌పై కేసులు నమోదు చేయడం సరికాదు. ఏపీ ప్రభుత్వం సాక్షి ఎడిటర్, రిపోర్టర్లపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి.
– పోలు రాజు, టీఎన్జీఓ ములుగు జిల్లా అధ్యక్షుడు
దాడులను ఖండిస్తున్నాం..


