పత్రికా స్వేచ్ఛను హరించొద్దు
కక్షసాధింపు చర్యలు మానుకోవాలి
నెహ్రూసెంటర్: సాక్షి దినపత్రిక, ఎడిటర్ ధనంజయరెడ్డిపై ఏపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు మానుకోవాలి. పత్రికా స్వేచ్ఛను హరిస్తే సమాజానికి మేలు జరగదు. జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడం సుపరిపాలన అనిపించుకోదు. అధికారం ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరికాదు. – ఎం.వివేక్, డీఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడు
ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు..
హన్మకొండ అర్బన్: ఏపీలో సాక్షి మీడియాపై అక్కడి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. సాక్షి మీడియాను, సంస్థ ప్రతినిధులను, జర్నలిస్టులను ఉద్దేశపూర్వకంగా వేధింపులకు గురిచేయడం దుర్మార్గపు చర్య. పత్రికా స్వేచ్ఛను కాలరాయడమంటే ప్రజల పక్షాన మాట్లాడే గొంతుకను నొక్కడమే. – ఆకుల రాజేందర్,
ఉద్యోగ సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్, హనుమకొండ
ఏపీ ప్రభుత్వానికి ఇది మంచిదికాదు
● సాక్షి దినపత్రిక, ఎడిటర్‌పై అక్రమ కేసులు ఎత్తివేయాలి
● ఉద్యోగ, విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్
ఆంధరప్రదేశ్ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరించడం తగదని, ఉద్దేశపూర్వకంగా సాక్షి దినపత్రికపై దాడులు, ఎడిటర్, విలేకరులపై అక్రమ కేసులు బనాయించడం సరికాదని, ఉద్యోగ, విద్యార్థి సంఘాల నాయకులు ఖండిస్తున్నారు. నిజాలను నిర్భయంగా రాస్తే అక్కడి పాలకులు జీర్ణించుకోలేకపోతున్నారని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య పత్రికలు వారధి అనే విషయాన్ని మర్చిపోవద్దని సూచిస్తున్నారు. అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు – సాక్షి నెట్‌వర్క్
పత్రికా స్వేచ్ఛను హరించొద్దు
పత్రికా స్వేచ్ఛను హరించొద్దు


