వీధి దీపాల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు
మేయర్ గుండు సుధారాణి
వరంగల్ అర్బన్ : మహా నగరంలో వీధి దీపాల నిర్వహణలో నిర్లక్ష్యం తగదని మేయర్ గుండు సుధారాణి హెచ్చరించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలోని తన చాంబర్‌లో శనివారం ఆమె ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మేయర్ మాట్లాడుతూ దీపావళి పర్వదినం సందర్భంగా ప్రతీ లైటు వెలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. నగరవాసులకు నీటి సరఫరాలో ఆటంకాలు లేకుండా క్షేత్రస్థాయిలో లోపాలను అరికట్టాలన్నారు. అవసరం మేరకు నీటి సరఫరా జరగని ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా అందించాలన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను సక్రమంగా నిర్వహించాలన్నారు. విద్యుత్ స్తంభాల షిఫ్టింగ్ సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ఉర్సు రంగ లీలా మైదానం జరిగే నరకసుర వధ కార్యక్రమానికి బల్దియా తరఫున విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్‌ఈ సత్యనారాయణ, ఈఈలు రవికుమార్, మహేందర్, సంతోశ్‌బాబు, మాధవీలత, డీఈలు రాజ్‌కుమార్, కార్తీక్‌రెడ్డి, రాగి శ్రీకాంత్ పాల్గొన్నారు.
బాణసంచా దుకాణదారులు
ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు పాటించాలి..
నగరంలో బాణసంచా విక్రయదారులు ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు పాటించాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. బాణసంచా దుకాణదారులు పాటించాల్సిన విధివిధానాలు, ఫైర్ సేఫ్టీ తదితర అంశాలపై శనివారం బల్దియా ప్రధాన కార్యాలయంలో అధికారులతో మేయర్ సమీక్షించి మాట్లాడారు. నగర వ్యాప్తంగా వరంగల్‌లో 3 ప్రాంతాల్లో, హనుమకొండ పరిధిలో 6 దుకాణాలకు మాత్రమే అనుమతులు ఉన్నాయని తెలిపారు. ప్రతీ టపాసుల దుకాణం వద్ద అగ్నిమాపక పరికరాలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ మార్గాలు ఉండేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు.
వరంగల్ అర్బన్‌లో 2,186,
వరంగల్ రూరల్ 989
కాజీపేట అర్బన్ : వరంగల్ అర్బన్ పరిధిలోని 67 వైన్స్‌కు 2025–27 సంవత్సరానికి టెండర్లు పిలవగా శనివారం చివరి రోజు 2,186 దరఖాస్తులు వచ్చాయి. టెండర్ ప్రక్రియ ప్రారంభించిన నాటినుంచి శనివారం వరకు మద్యం వ్యాపారులు 3,621 దరఖాస్తులు అందజేశా రు. వరంగల్ రూరల్‌లోని 57 వైన్‌షాపులకు గా ను చివరిరోజు 989 దరఖాస్తులు రాగా, మొ త్తంగా 1,905 దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. కాగా, టెండర్ దరఖాస్తుల ద్వారా వరంగల్ అర్బన్‌కు రూ.108 కోట్లు, వరంగల్ రూరల్‌కు రూ.57 కోట్ల ఆదాయం వచ్చింది.


