వైన్స్‌కు 19 దరఖాస్తులు
కాజీపేట అర్బన్ : హనుమకొండ జిల్లా(వరంగల్ అర్బన్)లోని 67 వైన్‌షాపులకు మంగళవారం 19 దరఖాస్తులను జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ స్వీకరించారు. టెండర్ ప్రక్రియ ప్రారంభించిన నాటి నుంచి మంగళవారం వరకు 171 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
వరంగల్: కొత్తపేటలోని శ్రీరాజ్, జైగురుదత్తా జిన్నింగ్ మిల్లులను మంగళవారం జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, వరంగల్ వ్యవసాయ మార్కెట్ గ్రేడ్–2 కార్యదర్శులు ఎస్.రాము, అంజిత్‌రావు, ఎస్.రాజేందర్ తనిఖీ చేశారు. వరంగల్ మార్కెట్ పరిధిలోని 24 జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. నిబంధనల మేరకు సౌకర్యాలు ఉన్నాయా లేవా అని తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు. సౌకర్యాలు ఉంటే సీసీఐ ఈనెలాఖరులోగా పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తుందని తెలిపారు.


