రేపు పేర్వారం జగన్నాథం స్మారక పురస్కార ప్రదానం
హన్మకొండ కల్చరల్ : హనుమకొండ వడ్డెపల్లి రోడ్డులోని పీఆర్ భవన్‌లో రేపు (గురువారం) సాయంత్రం తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ పేర్వారం జగన్నాథం స్మారకంగా పురస్కార ప్రదానం చేస్తున్నామని పేర్వారం జగన్నాథం ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ పేర్వారం శంకర్‌రావు, శ్రీనాథ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పురస్కార ప్రదానోత్సవంలో భాగంగా 2023 సంవత్సరానికి గాను సాహితీవేత్త డాక్టర్ లింగంపల్లి రామచంద్ర, 2024 సంవత్సరానికి సాహితీవేత్త డాక్టర్ పెద్ది వెంకటయ్య, 2025 సంవత్సరానికి కవి పొట్లపల్లి శ్రీనివాసరావుకు ప్రొఫెసర్ పేర్వారం జగన్నాథం స్మారక పురస్కార ప్రదానం చేయనున్న ప్రకటించారు. కార్యక్రమానికి కేయూ విశ్రాంత ఆచార్యులు బన్న అయిలయ్య సభాధ్యక్షుడిగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ముఖ్య అతిథి గా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, అతిథులుగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహిత డాక్టర్ అంపశయ్య నవీన్, కాంగ్రెస్ నాయకులు ఈవీ శ్రీనివాసరావు, కవి వీఆర్ విద్యార్థి పాల్గొంటారని తెలిపారు. కవులు, రచయితలు, అభిమానులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
పొట్లపల్లి శ్రీనివాసరావు
డాక్టర్ లింగంపల్లి రామచంద్ర
డాక్టర్ పెద్ది వెంకటయ్య
రేపు పేర్వారం జగన్నాథం స్మారక పురస్కార ప్రదానం
రేపు పేర్వారం జగన్నాథం స్మారక పురస్కార ప్రదానం


