కీటకం.. కీలకం | - | Sakshi
Sakshi News home page

కీటకం.. కీలకం

Sep 30 2025 7:19 AM | Updated on Sep 30 2025 7:19 AM

కీటకం

కీటకం.. కీలకం

సహజ పరాగ సంపర్కం..

ఆయిల్‌ పామ్‌లో అధిక దిగుబడికి పుష్పాల పరాగ సంపర్కం కీలకం

పరాగ సంపర్క కీటకాలు కీలకం..

హన్మకొండ: ఆయిల్‌ పామ్‌ సాగులో అధిక దిగుబడికి పరాగ సంపర్కం కీలకం. పరాగ సంపర్కం జరగడానికి కీటకాలు అవసరం. ఇందులో ఎలాయిడోబియస్‌ కామెరూనికస్‌ కీటకాలు ఆయిల్‌ పామ్‌ తోటల్లో పరాగ సంపర్కం జరగడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఆయిల్‌ పామ్‌ పుష్పాలను పరాగ సంపర్కం చేయడంలో కీటకాలు కీలకంగా పని చేస్తాయి. కాత కోసం రైతులు, అధికారులు పరగా సంపర్కానికి కీటకాలను తోటల్లో వదులుతున్నారు. ఇవి పూతను పిందెగా మార్చి దిగుబడిని పెంచుతాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పెద్ద ఎత్తున ఆయిల్‌ పామ్‌ తోటలు సాగు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో దాదాపు 15 వేల ఎకరాల్లో సాగు చేశారు. 2022 ఆగష్టులో ముందుగా హనుమకొండ, వరంగల్‌, జనగామ జిల్లాలో సాగు చేశారు. అప్పుడు దాదాపు 5,500 ఎకరాల్లో సాగు చేశారు. మూడేళ్ల క్రితం సాగు చేసిన తోటలు కొన్ని దిగుబడి ఇస్తుండగా మరికొన్ని తోటలు కాతకు వచ్చాయి. కాతకు వచ్చిన తోటల్లో పరాగ సంపర్కం కోసం రైతులు, అధికారులు ఆఫ్రికన్‌ పురుగులను తోటల్లో వదులుతున్నాయి.

ఆయిల్‌ పామ్‌ తోటల్లో పురుగుల

యాజమాన్యం..

ఎలాయిబోడియస్‌ కామెరూనికస్‌ పురుగు క్యూర్‌క్యులియోనిడే కుటుంబానికి చెందింది. ఆఫ్రికా ప్రాంతానికి చెందిన కీటకం. ఆడ కీటకం పుష్పాల లోపల గుడ్లు పెడుతుంది. లార్వా పుష్పంలోని కణజాలంలో పెరిగి ఆహారం తీసుకుంటుంది. ప్యూపా దశలో పుష్పం లేదా ఇన్‌ఫ్లోరెన్స్‌ లోపల రూపాంతరం చెందుతుంది. ఈ కీటకం చిన్న పరిణామంలో దాదాపు 4 మిల్లీ మీటర్ల పొడవు ఉండి నల్లని గోధుమ రంగులో ఉంటుంది. వీటి ఆయుష్షు 1 నుంచి 2 నెలలు. ఒక్క సారి వదిలితే సంతానాన్ని వృద్ధి చేసుకుంటూ తోటల్లోనే ఉంటుంది. ఇది ఆయిల్‌ పామ్‌ పరాగ సంపర్కంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ పురుగులను పరాగ సంపర్కానికి ఉపయోగించడం ద్వారా దిగుబడిని పెంచొచ్చని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు. మగ పుష్పాల నుంచి ఆడ పుష్పాలకు పుప్పొడి తరలిస్తూ సహజ పరాగ సంపర్కం చేస్తాయి. దీంతో ఆయిల్‌ పామ్‌లో ఫలసాధన శాతం పెరుగుతుంది. ఆయిల్‌పామ్‌ సాగు చేసిన 30 నెలలకు కాతకు వస్తుంది. అంతకు ముందు గెలలు వేసినా వాటిని తొలగించాలి. మొక్కలు నాటిన 26, 27 నెలలకు ఈ పరాగ సంపర్క కీటకాలను తోటల్లో వదిలిపెట్టాలి. 30 నెలలకు గెలలు వదిలిపెట్టాలి. గెల వేసిన 4 నుంచి 5 నెలలకు పక్వానికి వచ్చి కోతకు వస్తాయి.

ఈ కీటకాలతో మానవ శ్రమ లేకుండా పుప్పొడి బదిలీ జరిగి సహజ పరాగ సంపర్కం జరుగుతుంది. ఫలగుచ్ఛంలో గింజల నింపుదల బాగా పెరుగుతుంది. ఖర్చు తగ్గుతుంది. రసాయనాల అవసరం లేకుండా సహజంగా పనిచేస్తుంది. నిరంతర పుప్పొడి వ్యాప్తి జరుగుతుంది. పుష్పించే కాలమంతా వీటివల్ల ఫలసాధన కొనసాగుతుంది. ఆయిల్‌ పామ్‌ సాగులో ఎలాయిబోడియస్‌ కామెరూనికస్‌ ప్రవేశపెట్టిన తర్వాతే ప్రపంచవ్యాప్తంగా ఆ పంటలో దిగుబడులు గణనీయంగా పెరిగాయని ఉద్యాన అధికారులు తెలిపారు. ఈ కీటకాలు సహజంగానే నిరంతరం పని చేస్తాయి. ఇవి సహజసిద్ధంగా పని చేయడం వల్ల ఖర్చు తగ్గి, నూనె ఉత్పత్తి పెరుగుతుంది. తద్వారా అధిక ఆదాయం వస్తుంది.

ఎలాయిడోబియస్‌

కామెరూనికస్‌ కీటకం

ఈ ప్రక్రియ జరగ డంలో పురుగుల పాత్ర ప్రధానం

ఆయిల్‌ పామ్‌ తోటల్లో పరాగ సంపర్క కీటకాల పాత్ర కీలకం. మానవ అవసరం లేకుండా పుప్పొడిని చేరవేస్తాయి. పూతను పిందె, కాయగా మార్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. దిగుబడి పెరుగుతుంది. రైతులు లాభసాటి అయిన ఆయిల్‌ పామ్‌ సాగుకు ముందుకు రావాలి.

శ్రీనివాస్‌ రావు, ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి,వరంగల్‌

కీటకం.. కీలకం1
1/2

కీటకం.. కీలకం

కీటకం.. కీలకం2
2/2

కీటకం.. కీలకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement