
డే కేర్ సెంటర్‌లో ఉచిత న్యాయ సలహాలు
హన్మకొండ: హనుమకొండ జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలోని వయోవృద్ధుల డే కేర్ సెంటర్‌లో సీనియర్ సిటిజన్స్ కోసం ప్రారంభించిన లీగల్ ఎయిడ్ క్లినిక్ సేవలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. జిల్లా న్యాయసేవాధికార సంస్థ న్యాయ సలహాదారుగా పారాలీగల్ వలంటీర్ ఎం. ఉపేందర్‌ను నియమించింది. ప్రతీ బుధ, శనివారం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు న్యాయ సలహాలు అందిస్తారని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి తేరాల యుగేంధర్ తెలిపారు. వివరాలకు 8074979359 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తాడూరి లక్ష్మీనారాయణ, గంగారపు యాదగిరి, సుమతి, డాక్టర్ ఉష, తదితరులు పాల్గొన్నారు.