
108 సిబ్బంది అత్యుత్తమ సేవలందించాలి
హన్మకొండ అర్బన్: జిల్లాలో 108 వాహనాల ద్వారా సిబ్బంది అత్యుత్తమ సేవలందించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ సంబంధిత అధికారులు, సిబ్బందికి సూచించారు. జిల్లాకు ఇటీవల కొత్తగా వచ్చిన 108 ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ నసీరుద్దీన్, హనుమకొండ జిల్లా మేనేజర్ మండ శ్రీనివాస్ గురువారం కలెక్టర్ స్నేహ శబరీష్‌ను కలెక్టరేట్‌లో కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈసందర్భంగా కలెక్టర్‌కు సిబ్బంది పనితీరుతో పాటు జిల్లాలో గత సంవత్సర కాలంలో అందించిన సేవల్ని తెలియజేశారు. ఈసంవత్సరం జనవరి నుంచి జూన్ వరకు 10,619 మంది ప్రాణాలు కాపాడినట్లు పేర్కొన్నారు. చిన్నపిల్లల ఆంబులెన్స్ సైతం అందుబాటులో ఉందని.. ప్రజలు అత్యవసర సమయాల్లో ఫోన్ చేయాలని కోరారు.
నలుగురు
ఇన్‌స్పెక్టర్ల బదిలీ
హసన్‌పర్తి: వరంగల్ కమిషనరేట్ పరిఽధిలోని వివిధ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న నలుగురు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. సీసీఆర్బీలో విధులు నిర్వహిస్తున్న కర్ణాకర్‌ను మట్టెవాడకు, మట్టెవాడ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ తుమ్మ గోపీని వీఆర్‌కు, షీ టీం ఇన్‌స్పెక్టర్ సుజాతను వరంగల్ ట్రాఫిక్‌కు, వరంగల్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కె.రామకృష్ణ వీ.ఆర్‌కు బదిలీ చేశారు.
జాతీయ మధ్యవర్తిత్వ డ్రైవ్‌ను
వినియోగించుకోవాలి
డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి క్షమాదేశ్ పాండే
వరంగల్ లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు 90 రోజుల (జూలై 1 నుంచి సెప్టెంబర్ 30) వరకు జాతీయ మధ్యవర్తిత్వ డ్రైవ్‌లో పెండింగ్ కేసులు పరిష్కరించుకోవాలని హనుమకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జడ్జి క్షమాదేశ్‌పాండే కక్షిదారులను కోరారు. ఈడ్రైవ్ ద్వారా కక్షిదారులు కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులు, రాజీపడదగు కేసులు మధ్యవర్తిత్వం వహించి రాజీకుదిచ్చే ప్రయత్నం జరుగుతుందని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాద క్లెయిమ్, గృహ హింస, మహిళల రక్షణ, చెక్ బౌన్స్, వ్యాపార వివాదాలు, సర్వీస్ మ్యాటర్స్, క్రిమినల్, రుణ రికవరీ, విభజన, భూసేకరణ, ఇతర సివిల్ కేసులు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చని సూచించారు.
‘ఓపెన్’ విద్యార్థులు
పరీక్ష ఫీజు చెల్లించాలి
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు ఈఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించనున్నారు. పరీక్షలు రాయబోయే విద్యార్థులు ఫీజు చెల్లించేందుకు అపరాధ రుసుము లేకుండా ఈనెల 28 నుంచి ఆగస్టు 5 వరకు గడువు ఉందని ఉమ్మడి వరంగల్ జిల్లా ఓపెన్ స్కూల్ కో–ఆర్డినేటర్ అనగోని సదానందం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుము రూ.25తో ఆగస్టు 6 నుంచి 10వ తేదీ వరకు, రూ.50 అపరాధ రుసుముతో ఆగస్టు 11 నుంచి 15 వరకు గడువు ఉందని పేర్కొన్నారు.
విద్యార్థుల్లో శాసీ్త్రయ
దృక్పథాన్ని పెంచాలి
జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ సుజన్‌తేజ
విద్యారణ్యపురి: విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించాలని ఆధునిక పద్ధతుల్లో బోధించాలని వరంగల్ జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ సుజన్‌తేజ కోరారు. గురువారం వరంగల్‌లోని నరేంద్రనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రెండ్రోజులపాటు అటల్ టింకరింగ్ ల్యాబ్స్ నిర్వహణపై పీఎం శ్రీ స్కూల్స్ టీచర్లకు శిక్షణ ఇచ్చారు. ఈశిక్షణ ప్రారంభ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పీఎంశ్రీ పాఠశాలలకు అటల్‌టింకరింగ్ ల్యాబ్స్ పరికరాలను ఇన్‌స్టాలేషన్ చేసే విధానాన్ని తెలిపారు. రిసోర్స్‌పర్సన్లకు ఇచ్చే శిక్షణను వినియోగించుకోవాలని కోరారు. శిక్షణలో కోర్సు కో–ఆర్డినేటర్ జిల్లా సైన్స్ అధికారి కట్ల శ్రీనివాస్, నరేంద్రనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం వెంకటేశ్వర్‌రావు, ఈ శిక్షణకు పీఎంశ్రీ స్కూల్స్ నుంచి గణితం, ఫిజికల్ సైన్స్, బయోసైన్స్ టీచర్లు హాజరయ్యారు.

108 సిబ్బంది అత్యుత్తమ సేవలందించాలి