
నిట్ @ మియావాకీ
కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్‌లో అతి తక్కువ స్థలం ఎక్కువ మొక్కలు నాటే టెక్నాలజీని ఉపయోగించి మియావాకీ ఫారెస్ట్‌ను ఆవిష్కరించారు. 2019, ఆగస్టు 15న నాటి డైరెక్టర్ ఎన్వీ.రమణారావు చేతుల మీదుగా ప్రొఫెసర్లు, విద్యార్థులు ప్రారంభించిన మియావాకీ ఫారెస్ట్‌ను నేటి డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ సైతం కొనసాగిస్తున్నారు. ప్రతీ శనివారం మొక్కలు నాటుతున్నారు. క్యాంపస్‌లోని అంబేడ్కర్ లర్నింగ్ సెంటర్, ల్యాబ్స్, క్లాస్ రూం, హాస్టల్ ఏరియాలోని ఖాళీ స్థలాన్ని రెండెకరాలు గుర్తించి మొక్కలు నాటుతున్నారు. నిట్‌లోని మియావాకీ ఫారెస్ట్‌లో 4వేల పండ్లు, ఔషధ, పూలతోపాటు వివిధ రకాల మొక్కలు పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమతుల్యానికి తోడ్పడుతూ గ్రీన్ క్యాంపస్‌గా మార్చివేశాయి.