
తడి, పొడిచెత్తను వేరు చేయాలి
వరంగల్ అర్బన్: తడి, పొడిచెత్తను వేరు చేసి స్వచ్ఛ ఆటోలకు అందజేయాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ సూచించారు. ఖిలా వరంగల్‌పరిధిలోని 37, 38 డివిజన్లలో మంగళవారం తెల్లవారుజామున కమిషనర్ ఆకస్మికంగా పారిశుద్ధ్య పనులను తనిఖీ చేశారు. చెత్తను వేరు చేసి అందజేయడం లేదని స్వచ్ఛ ఆటోడ్రైవర్ల విజ్ఞప్తితో కమిషనర్ కాలనీల వాసులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఇంటి నుంచి కార్మికులు చెత్త సేకరించాలని ఆదేశించారు. ఓ వ్యక్తి తన పాత ఇంటి వ్యర్థాలను రోడ్డుపై డంపు చేయడంతో కమిషనర్ క్లాస్ తీసుకున్నారు. ప్రతి డివిజన్‌లో ఇద్దరు జవాన్లు మాత్రమే విధులు నిర్వర్తించాలన్నారు. ఆయా డివిజన్లలో పారిశుద్ధ్య సిబ్బంది ఎక్కడ విధులు నిర్వర్తిస్తున్నారో జవాన్లకు అవగాహన కలిగి ఉండాలని, సిబ్బంది హాజరు పారదర్శకంగా ఉండాలని పేర్కొన్నారు. నిర్దేశించిన ట్రేడ్ లైసెన్స్ వసూళ్ల లక్ష్యాన్ని చేరుకోకుంటే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. సీఏంహెచ్‌ఓ రాజారెడ్డి, ఎంహెచ్‌ఓ రాజేశ్, శానిటరీ సూపర్‌వైజర్ భాస్కర్, హెల్త్ ఇన్‌స్పెక్టర్ మధుకర్ పాల్గొన్నారు.
చెత్త తరలించే వాహనాలపై నిఘా పెట్టండి..
చెత్తను తరలించే వాహనాలపై నిరంతరం నిఘా పెట్టాలని కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టం (ఐసీసీసీ) కేంద్రాన్ని కమిషనర్ తనిఖీ చేశారు. పనితీరును అధికారులు వివరించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఇంటిగ్రేటెడ్ కెమెరాలు ఏసీటీఎస్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు అనుసంధానం చేసినట్లు వెల్లడించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ (ఎస్‌డబ్ల్యూఎం) కోసం కేటాయించిన వాహనాలకు ట్రాకింగ్ సిస్టం ఏర్పాటు చేయాలన్నారు. ట్రాన్స్‌ఫర్ స్టేషన్ నుంచి డంపింగ్ యార్డుకు వెళ్లిన వాహనాలను అధికారులు ప్రతి రోజూ మానిటరింగ్ చేయాలని సూచించారు. ఐటీ మేనేజర్ రమేశ్, మాట్రిక్స్ ఆల్వి ఎటర్నల్ సొల్యూషన్‌న్ ప్రతినిధులు నరసింహ, నికిషా, బెంజిమెన్, శ్రీధర్, కాశీవిశ్వనాథ్ పాల్గొన్నారు.
కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్