
కలెక్టరేట్ భవన పనుల్లో వేగం పెంచాలి
న్యూశాయంపేట: వరంగల్ నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాల నిర్మాణ పనుల్లో వేగం పెంచి గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. నగరంలోని ఆజంజాహి మిల్స్ గ్రౌండ్‌లో చేపట్టిన కలెక్టరేట్ పనుల పురోగతిని మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. కలెక్టరేట్ మూడు అంతస్తుల నిర్మాణాలు, కలెక్టర్ క్వార్టర్స్, అడిషనల్ కలెక్టర్ క్వార్టర్స్, మొదటి, రెండో అంతస్తులో డిజైన్ ప్రకారం పనులు జరుగుతున్నాయా.. లేదా.. అని పరిశీలించారు. స్ట్రక్చరల్ పనులు పూర్తయినందున ఫినిషింగ్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, అవసరమైన సిబ్బంది, వనరులను వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు.
గ్యాస్ కనెక్షన్లు ఇప్పించేందుకు చర్యలు
ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజ నం వండేందుకు గ్యాస్‌కనెక్షన్లు ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖల జిల్లా అధికారులు, గ్యాస్ ఏజెన్సీ డీలర్లతో కలెక్టరేట్‌లో మంగళవారం కలెక్టర్ సమావేశమయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 500 ప్రభుత్వ పాఠశాలల్లో గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు సహకరించాలని చెప్పారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు, గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.
వరంగల్ కలెక్టర్ సత్యశారద