
అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి
● పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
హన్మకొండ అర్బన్ : అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గస్థాయిలో ఇందిరమ్మ, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, కాజీపేట ఆర్వోబీ నిర్మాణ పనుల పురోగతి, భద్రకాళి చెరువు పూడికతీత పనులపై హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డిలతో కలిసి రెవెన్యూ, మున్సిపల్, గృహ నిర్మాణ, ఆర్‌అండ్‌బీ, సాగు నీటిపారుదల శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్షించారు. ఈ సందర్భంగా రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ కాజీపేట ఆర్వోబీ పనులను అధికారులు, కాంట్రాక్ట్ సంస్థ సమన్వయంతో త్వరగా పూర్తిచేయాలన్నారు. సమావేశంలో హనుమకొండ ఆర్డీఓ రమేష్, హౌసింగ్ పీడీ రవీందర్, ఆర్‌అండ్‌బీ ఈఈ సురేష్‌బాబు, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్, సాగునీటి పారుదలశాఖ ఈఈ శంకర్, తహసీల్దార్లు రవీందర్ రెడ్డి, బావ్‌సింగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
సీసీ రోడ్లు, డ్రెయినేజీ
నిర్మాణ పనులకు శంకుస్థాపన
హన్మకొండ చౌరస్తా: హనుమకొండ 4వ డివిజన్ పరిధిలోని జ్యోతిబసు నగర్, అక్షరకాలనీల్లో రూ.75 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణ పనులకు శుక్రవారం పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..గతంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకు నిధులు ఇవ్వలేదని, కానీ తమ ప్రజా ప్రభుత్వంలో పక్షపాతం లేకుండా నిధులు మంజూరు చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, స్థానిక కార్పొరేటర్ బొంగు అశోక్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.