
పద్మాక్షి అమ్మవారికి పుష్పార్చన
హన్మకొండ అర్బన్ : శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా నగరంలోని పద్మాక్షి కాలనీలో గల శ్రీ హనుమద్గిరి పద్మాక్షి అమ్మవారికి శుక్రవారం పుప్పార్చన నిర్వహించినట్లు అర్చకులు నాగిళ్ల షణ్ముఖ పద్మనాభ అవధాని, శంకర్ శర్మ తెలిపారు. పద్మాక్షి అమ్మవారికి తీరొక్క పూలతో అలంకరించి హారతి ఇచ్చినట్లు పేర్కొన్నారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించగా 7వ డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, కాకతీయ ఆస్పత్రి యాజమాన్యం డాక్టర్ ప్రవీణ్–నీరజ దంపతులు ప్రారంభించినట్లు తెలిపారు. ఆలయ ట్రస్ట్ కోశాధికారి శ్యాంసుందర్‌రెడ్డి, కార్యదర్శి నీలారపు రాజ్‌కుమార్, సభ్యులు విక్రమ్, సదానందం, వెంకట్, భక్తులు పాల్గొన్నారు.