
ఇద్దరు పిల్లలు ఉండాలి..
హన్మకొండ కల్చరల్: కాశిబుగ్గకు చెందిన రెడ్డి అనిల్‌కుమార్ ప్రైవేట్ ఉద్యోగి. అతడికి ఇద్దరు కుమారులు.. మధ్యతరగతి కుటుంబానికి చెందిన అనిల్‌కుమార్ చదువు పూర్తికాకముందే తండ్రి మరణించడంతో తల్లి హాస్పిటల్‌లో పనిచేస్తూ చెల్లిని, అనిల్‌ను సాకింది. అంతేకాకుండా అనిల్‌కుమార్ నాన్నమ్మను ఆమె ఇతర సంతానం చేరదీయకపోవడంతో ఆమె కూడా వీళ్లతోనే ఉండేది. కుటుంబంలో ఇద్దరు సంతానం ఉండడం వల్ల వృద్ధాప్యంలో ఒకరు కాకపోయిన మరొకరు తోడుగా ఉంటారని ఇద్దరు పిల్లలు ఉండాలని, ఒకరికి ఒకరుతోడుగా ఉంటారని అనిల్ దంపతులు అంటున్నారు.