
అంగుళమంగుళం లెక్క!
ఈ బ్రిడ్జిపై ప్రయాణం
సురక్షితమేనా..?
ఈ ఫొటోలు చూడండి.. ఒకవైపు కూలిపోతున్న ఫుట్‌పాత్‌లు.. మరోవైపు ఏపుగా పెరిగిన రావి, జిల్లేడు చెట్లు. ఇంకోవైపు రక్షణగోడ కూలిపోవడంతో తాత్కాలికంగా సిమెంట్ ఇటుకలతో కట్టిన గోడ. ఈ బ్రిడ్జిపై గుంతలు లెక్కేలేవు. విద్యుత్ స్ట్రీట్‌లైట్ల తీగలు బయటికి వచ్చి ప్రమాదకరంగా ఉన్నవైనం. ఇది ఎక్కడో కాదండోయ్.. వరంగల్ నగరంలో హంటర్‌రోడ్డు నుంచి నాయుడు పంపు జంక్షన్‌ను కలిపే బ్రిడ్జి దుస్థితి. దీనిపైనుంచే ఎక్కువగా నగరంనుంచి ఖమ్మం వైపు వాహనాలు వెళ్తుంటాయి. దీంతో ఈ బ్రిడ్జిపై ప్రయాణం సురక్షితమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బల్దియా అధికారులు పట్టించుకుని మరమ్మతులు చేస్తారా.. లేక వదిలేస్తారా అన్నది చూడాలి.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, వరంగల్

అంగుళమంగుళం లెక్క!

అంగుళమంగుళం లెక్క!