
వారాహి అవతారంలో పద్మాక్షీదేవి
హన్మకొండ అర్బన్: ఆషాఢమాసం శాకంబరీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు (శుక్రవారం) నగరంలోని పద్మాక్షి కాలనీలోని శ్రీ హనుమద్గిరి పద్మాక్షిదేవి వారాహి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు నాగిళ్ల షణ్ముఖ పద్మనాభ అవధాని, నాగిళ్ల శంకర్‌శర్మ ఉదయం అమ్మవారికి పూర్ణాభిషేకం నిర్వహించి వారాహి మాతగా అలంకరించారు. మంత్రపుష్పం నామ సంకీర్తన నిర్వహించారు. జూలై 10వ తేదీ వరకు నిర్వహించే శాకంబరీ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పద్మాక్షి దేవిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ట్రస్ట్ సభ్యులు సదానందం, రాజ్‌కుమార్, భక్తులు పాల్గొన్నారు.