
నేత పని, జీవన విధానంపై డాక్యుమెంటరీ
రామన్నపేట: వరంగల్ కొత్తవాడలోని చేనేత కార్మికుల గృహాలు, వారి పని ప్రక్రియను ఐఐసీడీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్ట్రాఫ్ట్ అండ్ డిజైన్) బృందం మంగళవారం పరిశీలించింది. పాత తరం నైపుణ్యాల్ని కాపాడేందుకు తెలంగాణ క్రాఫ్ట్ కౌన్సిల్ సహకారంతో ఐఐసీడీ ఉమ్మడి జిల్లాలోని వృత్తులకు సంబంధించిన అన్ని ఉత్పత్తులను డాక్యుమెంట్ చేయడానికి పూనుకున్నట్లు ప్రతినిదులు తెలిపారు. ఏళ్లు గడిచే కొద్ది పాతతరం కళాకారులు, నేత కార్మికులు వివిధ కారణాల వల్ల తమ నైపుణ్యాన్ని తదుపరి తరానికి అందించలేకపోతున్నారని, ఈ సవాల్‌ను ఎదుర్కొనేందుకు తెలంగాణ క్రాఫ్ట్ కౌన్సిల్ ఈడాక్యుమెంటేషన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈబృందానికి టీపీసీసీ నేత, చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్లు నేత కార్మికుల జీవన విధానాన్ని, వారి పనితీరును వివరించారు. కార్యక్రమంలో జిల్లా రూరల్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు భవాని, అశోక్, డాలియా తదితరులు పాల్గొన్నారు.