
నిట్‌లో జీయాన్ వర్క్‌షాప్ షురూ
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లోని సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జీయాన్ (గ్లోబల్ ఇన్షియేటివ్ ఆఫ్ అకడమిక్ నెట్వర్క్) ఐదు రోజుల వర్క్‌షాప్ సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ‘రిపేర్ అండ్ రీమాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ పార్ట్స్ యూసింగ్ డైరెక్ట్ ఎనర్జీ డీపొజిషన్, అడిటివ్ మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ సస్టేనబుల్ ట్రాన్స్పోర్ట్ ఎట్ నిట్’ అంశాలపై ఏర్పాటు చేసిన ఐదు రోజుల వర్క్‌షాప్‌నకు ముఖ్య అతిథులుగా యూఎస్ఏలోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరీడా ప్రొఫెసర్ నవీన్ఏలూరు, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ ఆస్టీన్ ప్రొఫెసర్ డేవిడ్ బోరెల్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వర్క్‌షాప్ ప్రారంభించి సావనీర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో జీయాన్ కో–ఆర్డినేటర్, ప్రొఫెసర్ శ్రీనివాసరావు, సివిల్, మెకానికల్ హెడ్స్ రవికుమార్, శంకర్, రఘురాం, ఏపీ, తెలంగాణ, కర్నాటక, పాండిచ్చేరి వివిధ విద్యా సంస్థల నుంచి 60 మంది పీజీ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.