జిల్లా కలెక్టర్‌గా సాయికాంత్‌ వర్మ | - | Sakshi
Sakshi News home page

జిల్లా కలెక్టర్‌గా సాయికాంత్‌ వర్మ

Mar 30 2026 8:39 AM | Updated on Mar 30 2026 8:39 AM

జిల్లా కలెక్టర్‌గా సాయికాంత్‌ వర్మ

గుంటూరు వెస్ట్‌: గుంటూరు జిల్లా కలెక్టర్‌గా సీఎం సాయికాంత్‌ వర్మను నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు కలెక్టర్‌గా విధులు నిర్వర్తించిన తమీమ్‌ అన్సారియాను స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌గా నియమిస్తూ బదిలీ చేశారు. ప్రస్తుతం ఏపీ ఎకనామిక్‌ డెవల్‌మెంట్‌ బోర్డ్‌ (ఏపీఈడీబీ) సీఈఓగా పనిచేసిన సాయికాంత్‌ వర్మ 1989లో కర్నూలులో జన్మించారు. ఆయన మద్రాస్‌ ఐఐటీ నుంచి ఎంటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌లో ఉత్తీర్ణత సాధించారు. అమెజాన్‌, గూగుల్‌ వంటి సంస్థల్లో పనిచేసిన ఆయన 2015లో యూపీఎస్‌ిసీ పరీక్షల్లో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌ 15వ ర్యాంకు సాధించారు. తొలి ప్రయత్నంలోనే అత్యుత్తమ ర్యాంకు సాధించి ఆయన ఐఏఎస్‌గా ఎంపిక కావడం గమనార్హం. కేవలం 26 సంవత్సరాల వయస్సులోనే దేశ అత్యుత్తమ సర్వీసుకు ఎంపిక కావడం విశేషం.

తమీమ్‌ అన్సారియా బదిలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement