వనదుర్గాదేవిగా భ్రమరాంబ అమ్మవారు
వైభవంగా భ్రమరాంబ మల్లేశ్వరస్వామివార్ల కల్యాణ ఏర్పాట్లు
మహా శివరాత్రి రోజున రాహు కేతు పూజలు
100 అభిషేకాలు మినహా అన్ని ఆర్జిత సేవలు నిలిపివేత
వేలాదిగా తరలిరానున్న భక్తులు
తొందరపాటు ప్రయాణం వద్దు
పెదకాకాని: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెదకాకానిలోని భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో మహా శివరాత్రి కల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో రెండో రోజైన శుక్రవారం భ్రమరాంబ అమ్మవారు వనదుర్గాదేవిగా భక్తులను అనుగ్రహించారు. దేవస్థానంలో శుక్రవారం ఉదయం 5 గంటలకు సుప్రభాతసేవ, పంచహారతులతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 7 గంటలకు గ్రామ బలిహరణ, 8:30 గంటలకు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మధ్యాహ్నం 1 గంటకు మహానివేదన, నిత్యౌపాసన, గ్రామబలిహరణ నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు పంచహారతులు ఇచ్చారు. మహా శివరాత్రి రోజున ఆదివారం రాహు కేతు పూజలు, 100 అభిషేకాలు మినహా అన్ని అర్జిత సేవలు నిలిపివేయడం జరుగుతుందని ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నట్లు తెలిపారు. తెనాలి రమేష్‌బాబు బృందంచే భక్తిరంజని, నటరాజ నృత్యనిలయం విజయవాడ వారిచే కూచిపూడి నృత్యం, వెనిగండ్ల ఉల్లంగుల బ్రహ్మం ఆధ్వర్యంలో గయోపాఖ్యానం నాటకం నుంచి యుద్ధసీను, నిడుబ్రోలు వేపసూరి వెంకట్రావు ఆధ్వర్యంలో బాలనాగమ్మ నాటకం నుండి ఫకీరు, సంగు సీన్లు అద్భుతంగా ప్రదర్శించారు. మహాశివరాత్రి కల్యాణ బ్రహోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణం అంతటా విద్యుత్ కాంతులతో కళకళలాడుతుంది.
నగరంపాలెం (గుంటూరు వెస్ట్) : రాత్రివేళ నిద్రమత్తు వల్ల జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకు ఫేస్ వాష్ / గో అంటూ ప్రత్యేక స్పెషల్ డ్రైవ్‌ను పోలీసులు శుక్రవారం రాత్రి చేపట్టారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు జిల్లా, ప్రాంతీయ రహదారులపై పోలీస్ అధికారులు, సిబ్బంది ఈ డ్రైవ్‌ను నిర్వహించారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు నిద్రమత్తు కారణంగా వాహనాలపై నియంత్రణ కోల్పోయి, ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయని డ్రైవర్లకు తెలియజేశారు. ఆయా వాహనాలను నిలిపి డ్రైవర్లతో మాట్లాడి, ప్రమాదాలపై అవగాహన కల్పించారు. వారికి తాగునీరు అందించి, ముఖాలను నీటితో శుభ్రం చేసుకునేందుకు నీటి సీసాలను అందించారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలని డ్రైవర్లకు సూచించారు. రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. జిల్లాలోని బ్లాక్ స్పాట్స్, రోడ్డు ప్రమాదాల ఏరియాలు, ప్రధాన జంక్షన్లు, టోల్‌గేట్ల వద్ద ఈ డ్రైవ్‌ను కొనసాగించారు. తొందరపాటు ప్రయాణం కంటే ప్రాణ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని డ్రైవర్లకు చెప్పారు.
వనదుర్గాదేవిగా భ్రమరాంబ అమ్మవారు


