నీటి సంఘాలతో సబ్‌కమిటీల ఏర్పాటుకు చర్యలు
తెనాలి: కృష్ణా పశ్చిమ డెల్టాలో 2026–27 సంవత్సరానికి కాల్వలు, డ్రైన్ల మరమ్మతులకు డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, నీటి వినియోగదారుల సంఘాలతో సబ్ కమిటీలను ఏర్పాటు చేయాలని జలవనరులశాఖ సూపరింటెండెంట్ ఇంజినీరు పులిపాటి వెంకటరత్నం సూచించారు. పంటలకు నీటి సరఫరా, వేసవిలో పంట కాల్వల మరమ్మతుల సన్నాహాలపై శుక్రవారం ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ ప్రాజెక్టు కమిటీ కార్యవర్గ సమావేశం శుక్రవారం సాయంత్రం తెనాలిలో నిర్వహించారు. కృష్ణా పశ్చిమడెల్టా డివిజన్ కార్యాలయంలో జరిగిన సమావేశానికి ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పంతాని మురళీధరరావు అధ్యక్షత వహించారు. గతేడాది ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో పూర్తయిన పనులు వివరాలను తెలియజేశారు. ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ ఎన్.సునీల్ చౌదరి సభ్యులతో మాట్లాడారు. జలవనరుల శాఖ ఎస్‌ఈ పులిపాటి వెంకటరత్నం మాట్లాడుతూ రానున్న ఖరీఫ్ సీజన్లో నీటిని అందించే క్రమంలో చేపట్టాల్సిన ఓఅండ్‌ఎం పనులపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం, నీటితీరువాలు, నీటి సరఫరాపై నీటి సంఘాలతో సమీక్షించారు. సమావేశంలో ఇరిగేషన్ డివిజన్ గుంటూరు ఈఈ వెంకట రమణ, కృష్ణ పశ్చిమ భాగం తెనాలి ఈఈ ఎస్ సుధాకర్, రేపల్లె డ్రైనేజీ డివిజన్ ఈఈ ప్రేమకుమార్, కార్యాలయం పరిపాలన అధికారి దాసరి అనిల్ కుమార్, ఇరిగేషన్, డ్రైనేజీ డీఈఈ, ఏఈలు పాల్గొన్నారు.
పశ్చిమ డెల్టా సూపరింటెండెంట్ ఇంజనీరు పులిపాటి వెంకటరత్నం
నీటి సంఘాలతో సబ్‌కమిటీల ఏర్పాటుకు చర్యలు


