జాతీయ షూటింగ్‌లో ముఖేష్‌కు మరో రజతం | - | Sakshi
Sakshi News home page

జాతీయ షూటింగ్‌లో ముఖేష్‌కు మరో రజతం

Dec 31 2025 7:23 AM | Updated on Dec 31 2025 7:23 AM

జాతీయ షూటింగ్‌లో ముఖేష్‌కు మరో రజతం

జాతీయ షూటింగ్‌లో ముఖేష్‌కు మరో రజతం

గుంటూరు వెస్ట్‌(క్రీడలు): ఢిల్లీలో జరుగుతున్న 68వ జాతీయ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో గుంటూరుకు చెందిన నేలవల్లి ముఖేష్‌ మరో రజత పతకం సాధించాడని నేలవల్లి శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 25 మీటర్ల స్టాండర్డ్‌ పిస్టల్‌ జూనియర్‌ విభాగంలో ముఖేష్‌ 569/600 పాయింట్లతో మంగళవారం మరో రజత పతకం సాధించినట్లు తెలిపారు. ఒక్క పాయింట్‌ తేడాతో బంగారు పతకం చేజారిపోయిందన్నారు. ముఖేష్‌కు ఈ టోర్నమెంట్‌లో ఇది రెండో పతకం అని తెలిపారు. ముఖేష్‌ను ఆంధ్రప్రదేశ్‌ రైఫిల్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి రాజకుమార్‌, కేఎల్‌ యూనివర్సిటీ స్పోర్ట్స్‌ విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ కాకర్ల హరికిషోర్‌, పీడీ శ్రీహరి, పూజిత అభినందించారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement