ఘనంగా ప్రారంభమైన క్రెడాయి ప్రాపర్టీ షో
● మేయర్ కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ క్రెడాయి ప్రతి సంవత్సరం ప్రాపర్టీషో విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. వివిధ రంగాలకు చెందిన అన్ని కంపెనీల ఉత్పత్తులు ఒకేచోట లభించడం శుభ పరిణామమన్నారు.
● ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ క్రెడాయి ప్రాపర్టీషో ఇంత భారీ స్థాయిలో నిర్వహించడం సంతోషకరమన్నారు. గుంటూరు పరిసర ప్రాంతాల అభివృద్ధికి బిల్డర్స్ పాత్ర కీలకమన్నారు.
● క్రెడాయి మాజీ ఏపీ చైర్మన్ ఆళ్ల శివారెడ్డి మాట్లాడుతూ క్రెడాయి 8వ ప్రాపర్టీ షో వినియోగదారులకు అనువుగా నిర్వహించడం జరుగుతోందన్నారు. బ్యాంకులు ఒకేచోట రుణ సౌకర్యం కల్పించడం శుభ పరిణామమన్నారు. ఈ ప్రాపర్టీ షో మూడు రోజుల పాటు ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటలకు వరకు జరుగుతుందన్నారు.
● క్రెడాయి ప్రెసిడెంట్ మామిడి రాము మాట్లాడుతూ ప్రతిరోజూ 10 బంపర్ లక్కీ డ్రాలు తీయనున్నామన్నా రు. శుక్రవారం జరిగిన లక్కీడ్రాను గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తీశారని వెల్లడించారు. విజేతలకు బహుమతులు అందించనున్నట్లు చెప్పారు.
నగరంపాలెం(గుంటూరువెస్ట్):గుంటూరు నగరంలో ప్రముఖ స్థిరాస్థి సంస్థ క్రెడాయి ప్రాపర్టీ షోను గుంటూ రు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర శుక్రవారం ప్రారంభించారు. యూనియన్ బ్యాంక్ డీజీఎం సయ్యద్ జవహర్, స్టేట్ బ్యాంక్ డీజీఎం బి.కృష్ణకుమార్ ప్రభు జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో ది–గుంటూరు కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్‌ఎం కిరణ్‌రెడ్డి, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, క్రెడాయి మాజీ ఏపీ చైర్మన్ ఆళ్ల శివారెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
గుంటూరు క్రెడాయి చైర్మన్ ఆరుమళ్ల సతీష్‌రెడ్డి, సెక్రటరీ మెట్టు సాంబశివారెడ్డి, ట్రజరర్ ఎ.వి.నాగార్జునరెడ్డి, ప్రాపర్టీ షో 2025 కన్వీనర్ తియ్యగూర వినోద్‌రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ శివనాగేశ్వరరావు, క్రెడాయి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి రాంబాబు పాల్గొన్నారు.